పుట:Hello Doctor Final Book.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19. మద్యపాన వ్యసనము ( Alcoholism ) మద్యము లేక సారాయిగా వ్యవహరించబడే రసాయనపదార్థమును రసాయన శాస్త్రములో ఎథనాల్ (Ethanol), లేక ఇథైల్ ఆల్కహాలు (Ethyl alcohol) CH3-CH2-OH (C2H6O) గా వ్యవహరిస్తారు. చక్కెరలను మధుశిలీంధ్రముతో (yeast) పులియబెట్టి సారాయిని తయారు చేస్తారు. చైనా, భారతదేశముల వంటి  ప్రాచీన సంస్కృతులలో మద్యము తయారి, వాడుకలు ఉన్నాయి. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనము చేసినపుడు ‘సుర‘ ఆవిర్భవించినట్లు వర్ణించబడింది. ఆరబ్ దేశములలో సారాయి బట్టీపట్టు ప్రక్రియ (distillation) ప్రథమముగా వాడుకలో వచ్చినట్లు చెబుతారు. మద్యములలో బార్లీసారా (beer), ద్రాక్షసారా (wine), తాటికల్లు (Palmyra toddy), ఈతకల్లు (Date tree toddy), ఇప్పసారాయి వంటి బట్టీపట్టని (fermented but not distilled) సారాయిలలో మద్యము 4 నుంచి 16 శాతము వఱకు ఉండవచ్చును. బట్టీపట్టిన (distilled) విస్కీ, జిన్, వోడ్కా, బ్రాందీ వంటి మద్యములలో మద్యము  20 శాతము మించి ఉంటుంది మితము తప్పిన మద్యము వాడుక వలన శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి. కొందఱిలో మద్యము వ్యసనముగా పరిణమిస్తుంది. మద్యము  త్రాగుట మొదలిడినవారు మితము తప్పినపుడు, దానికొఱకు పరితపించుట (craving), తప్పనిసరిగా త్రాగాలనుకొనుట (compulsion), మద్యము వాడుకను ఆధీనములో ఉంచుకొనలేకపోవుట (loss of control), దైనందిన జీవితములో మద్యముపై ఆధారపడుట (alcohol dependence), త్రాగిన ఫలితమునకు ఎక్కువ మోతాదులలో త్రాగవలసివచ్చుట (tolerance) సారాయి వ్యసనములో కలిగే వివిధ స్థాయిలు. మద్యము వాడుక వలన వ్యక్తిగత, చట్టపరమైన సమస్యలు

214 ::