పుట:Hello Doctor Final Book.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేరుతాయి. దీర్ఘ కా లిక వ్యాధికి దారి తీయక పోయినా, గర్భిణీస్త్రీలలో ఈ వ్యాధి తీవ్రమయి సుమారు 20 శాతము మందిలో మృత్యువునకు దారితీస్తుంది. చైనాలో ఈ వ్యాధికి టీకా లభ్యము. పందులలో ఈ వ్యాధి ప్రబలముగా ఉంటుంది. హెచ్చు ఉష్ణోగ్రతలలో ఉడికించని పందిమాంసపు వినియోగము వలన ఈ వ్యాధి రావచ్చును.

సూక్షాంగజీవులు, పరాన్నభుక్తులు (మలేరియా, అమీబా, ట్రిపనోజోమా, లీష్మానియా, ఎఖినోకోకస్ గ్రాన్యులోసస్, కాలేయపు క్రిమి ఫాషియోలా హెపాటికా లు) కాలేయవ్యాధులు కలిగిస్తాయి.

కలుషిత ఆహార పానీయముల వలన కాలేయపు వ్యాధులే గాక అనేక యితర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ప్రజలు అందఱికీ పాశ్చాత్యదేశపు మరుగుదొడ్లను సమకూర్చి మలములను కలుషరహితము చెయ్యాలి. అందఱికీ సురక్షిత జలము లభ్యము అగునట్లు చూడాలి. ఇది అన్ని ప్రభుత్వాల, అన్ని నాగరిక సమాజాల బాధ్యత.

213 ::