పుట:Hello Doctor Final Book.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాపము కలిగిస్తాయి. కాలేయ కణముల నుంచి కాలేయ జీవోత్ప్రేరకములు (liver enzymes) విడుదలయి రక్తములో వాటి పరిమాణములు పెరుగుతాయి. హెపటైటిస్ సి వలన కాలేయపు వ్యాధి కలిగిన వారందఱిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. కామెరలు కూడా కలుగక పోవచ్చును. విషజీవాంశములకు

ప్రతిరక్షకాలను (Antibodies) రక్తపరీక్షలో కనుగొనుట వలన వ్యాధి నిర్ణయము చేయవచ్చు. విషజీవాంశములను కూడా రక్తపరీక్షలతో కనుక్కోవచ్చును. విషజీవాంశములు (viruses) రక్తములో పొడచూపినవారికి మందులతో చికిత్స చేయగలిగే అవకాశాలు ఎక్కువే. ఈ వ్యాధి  దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమిస్తే  నారంగ కాలేయ వ్యాధికి ( Cirrhosis of liver ), కాలేయ కర్కటవ్రణములకు ( Liver Cancers) దారి తీయవచ్చును. హెపటైటిస్ సి కి టీకాలు లభ్యముగా లేవు. వ్యాధిగ్రస్థులను మందులతో నయము చేయుట వలన, వారి సంఖ్యను తగ్గించవచ్చు. రక్తదానము చేసే వారికి హెపటైటిస్ బి, సి, వ్యాధులు లేవని నిర్ధారించుట వలన, సురక్షిత రక్తము , రక్త ాం శములనే వాడుటవలన, సూదులతో మాదకద్రవ్యాల వినియోగము అరికట్టుట వలన, సురక్షితమైన సూదులు, క్షురికలను వాడుట వలన, సురక్షిత సంభోగము వలన హెపటైటిస్  బి, సి వ్యాధులను నివారించవచ్చును. హెపటై టిస్ డి ( Hepatitis D ) :-

దీనిని కలిగించు నలుసులు విషజీవాంశముల (viruses) కంటె చిన్నవి. హెపటైటిస్ బి ఉన్నవారికే ఈ వ్యాధి  కలుగుతుంది. రక్త ము , రక్త ాం శములు, శారీరక ద్రవముల ద్వారా ఈ నలుసులు శరీరములోనికి ప్రవేశిస్తాయి. చాలామందిలో ఈ వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి టీకాలు లభ్యముగా లేవు. హెపటై టిస్ ఇ ( Hepatitis E ) :-

ఆసియాఖండములో ఈ వ్యాధి ఉన్నది. ఢిల్లీ, కాశ్మీరు, మయినమారులలో ఈ వ్యాధి అలలుగా కొన్ని పర్యాయములు పెచ్చుమీరింది. ఈ విషజీవాంశములు (viruses) కలుషిత ఆహార పానీయముల ద్వారా శరీరములోనికి

212 ::