పుట:Hello Doctor Final Book.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Transplantation) అవసరము కావచ్చు. దీనిని అరికట్టుటకు టీకాలు లభ్యము. అందఱికీ ఆ టీకాలు వెయ్యాలి. హెపటై టిస్ బి ( Hepatitis B ) :-

ఈ విషజీవాంశములు (viruses) ఆంత్రేతర మారము ్గ ల (Parenteral routes) ద్వారా శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్త పరరక్త దానముల (Blood transfusions) వలన, విషజీవాంశములతో కలుషితమైన సూదులు వాడుట వలన, వ్యాధిగ్రస్థులతో సంభోగించుట వలన, ఈ వ్యాధి వ్యాపిస్తుంది.ఈ వ్యాధిగ్రస్థులలో 95 నుంచి 99 శాతము మందిలో వ్యాధి దానంతట అదే  రెండు నుంచి నాలుగు మాసములలో తగ్గిపోతుంది. వీరికి ఆలంబన చికిత్స (Supportive treatment) అవసరము, వీరికి సరియైన పోషక ఆహారము, ద్రవములు అందేటట్లు చూడాలి. వీరు మద్యము, కాలేయానికి హాని కలిగించు ఔషధములు వినియోగించకూడదు. వ్యాధి తీవ్రముగా ఉంటే విషజీవాంశ నాశకములను (antivirals) వాడాలి. ఆరు మాసములకు వ్యాధి తగ్గకపోతే దానిని దీర్ఘకాలిక కాలేయతాపముగా (Chronic Hepatitis) పరిగణించాలి. హెపటైటిస్ బి  2 - 5 శాతము మందిలో దీర్ఘకాలిక వ్యాధిగా పరిణామము చెందుతుంది. వీరికి విషజీవాంశ నాశకములను (antivirals) వాడుతారు. దీర్ఘకాలిక కాలేయ తాపము కలిగిన వారిలో కొందఱికి నారంగ కాలేయ వ్యాధి (Cirrhosis of liver), కాలేయ కర్కటవ్రణములు (hepatic cancers) రావచ్చు. ఈ వ్యాధి రాకుండా టీకాలు ఉన్నాయి. అందఱికీ ఆ టీకాలు అవసరము. వ్యాధిగ్రస్థులైన తల్లులకు పుట్టిన పిల్లలకు పుట్టిన 12 గంటలలో టీకాతో బాటు ప్రతిరక్షకములను (immunoglobulin) కూడా వ్యాధి నివారణకై యివ్వాలి. హెపటై టిస్ సి ( Hepatitis C ) :-

హెపటైటిస్ సి విషజీవాంశములు (viruses) వ్యాధిగ్రస్తమైన రక్తము, రక్తాంశములు, శరీర ద్రవములతో రక్త గ్రహణముల ద్వారా గాని, సూదుల ద్వారా గాని, సంభోగము వలన గాని, శరీరములోనికి ప్రవేశించి కాలేయ

211 ::