పుట:Hello Doctor Final Book.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్కటవ్రణములు (Pancreatic cancers) యితర నాళ బంధనములు, యీ అవరోధక పచ్చకామెర్లు (Obstructive jaundice) కలుగచేస్తాయి.

వైద్యపరీక్షలతో బాటు, రక్తపరీక్షలు, శ్రవణాతీతధ్వని చిత్రీకరణలు (Ultrasonography), గణనయంత్ర చిత్రీకరణములు (cat scans), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు (magnetic resonance imaging), హెపటైటిస్ పరీక్షలు, కణపరీక్షలు (Biopsies), అంతర్దర్శన పరీక్షలు (Endoscopic examinations), రోగనిర్ణయానికి తోడ్పడుతాయి. కాలేయ తాపము ( Hepatitis) :-

కాలేయతాపము విషజీవాంశములు (viruses) వలన, సూక్షాంగ జీవులు (bacteria) వలన, పరాన్నభుక్తులు (parasites) వలన, మద్యపానము వలన, కొన్ని ఔషధాల వలన, కలుగవచ్చును. కాలేయకణములు కొన్ని విచ్ఛిన్నము అగుటచే  రక్తములో కాలేయ జీవోత్ప్రేరకముల (Liver enzymes) పరిమాణములు పెరుగుతాయి. కామెరలు కూడా కలుగ వచ్చు. విషజీవాంశముల (Viruses) వలన వచ్చే కాలేయతాపములు :హెపటై టిస్ ఎ ( Hepatitis A ) :

ఈ  విషజీవాంశములు కలుషిత జలము, కలుషిత ఆహారములు తీసుకొనుట వలన (పురీష వదన మార ్గ ము /fecal-oral route) శరీరములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యాధి సోకినవారు వ్యాధిలక్షణములు కనిపించుటకు కొద్ది వారముల ముందుగాను, వ్యాధి కలిగిన  కొద్దివారములు తరువాత కూడా విషజీవాంశములను (viruses) మలములో విసర్జిస్తారు. అట్టి మలముతో కలుషితమైన నీరు, ఆహారములను గ్రహించుట వలన వ్యాధి సోకుతుంది. పచ్చకామెర్లు ప్రధాన లక్షణము. కొంతమందిలో ఏ లక్షణాలు పొడచూపవు. ఈ వ్యాధి 99 శాతము మందిలో ఒకటి, రెండు మాసములలో సంపూర్ణముగా దానికదే నయమవుతుంది. వీరికి ఏ మందులు అవసరము ఉండవు. చక్కని ఆహారము సమకూర్చి శుష్కించకుండా చూస్తే చాలు. ఒక శాతపు మందిలో ప్రమాదకర కాలేయవైఫల్యము (Fulminant hepatic failure) కలుగవచ్చును. అట్టివారికి పరకాలేయ దానము  (Liver

210 ::