పుట:Hello Doctor Final Book.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలేయపు కామెరలు ( Hepatic / Hepatocellular jaundice ) :-

కాలేయపు కణాలలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముతో సంయోగము చెంది (Conjugate) జలద్రావణీయత పొంది పైత్యరసములో (Bile) స్రవించబడి పైత్యనాళముల (Bile ducts) ద్వారా చిన్నప్రేవుల మొదటి భాగమైన డుయోడినమునకు (Duodenum) చేరుతుంది. కాలేయపు వ్యాధులు ఉన్నవారిలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముల సంయోగమునకు, సంయోగమైన బిలిరుబిన్ యొక్క స్రావమునకు, అంతరాయము కలుగుట వలన, రక్తములో బిలిరుబిన్ ప్రమాణములు పెరుగుతాయి. విషజీవాంశముల (Viruses) వలన, సూక్షాంగజీవులు వలన, పరాన్నభుక్తులు వలన వచ్చే కాలేయతాపములు (Hepatitis), మద్యము, విషపదార్థములు, కొన్ని ఔషధములు వలన కలిగే కాలేయవ్యాధులు, నారంగ కాలేయ వ్యాధి (Cirrhosis of liver), కాలేయములో కర్కటవ్రణములు (Cancers) కాలేయపు పచ్చకామెర్లు కలిగిస్తాయి. అవరోధక కామెరలు :కాలేయ అనంతరపు కామెరలు (Obstructive jaundice : Post hepatic Jaundie ) :కాలేయములో గ్లూకొరోనికామ్లముతో సంయోగమయిన బిలిరుబిన్ పైత్యరసములో స్రవించబడి పైత్యనాళముల (bile ducts) ద్వారా ప్రథమాంత్రమునకు (duodenum) చేరుతుంది. పైత్య ప్రవాహమునకు అవరోధము కలుగుతే సంయోగపు బిలిరుబిన్ (Conjugated bilirubin) తిరోగమనమయి రక్తములో ప్రసరించబడుతుంది. ఈ సంయోగపు బిలిరుబిన్ చర్మము, శ్వేతపటలములలో చేరి కామెరలు కలిగిస్త ుం ది, మూత్రములో విసర్జించబడి మూత్రమునకు పచ్చరంగు కలిగిస్త ుం ది, చెమటలో స్రవించబడి దుస్తులకు పచ్చరంగు చేకూరుస్తుంది. ప్రేవులకు బిలిరోబిన్ చేరకపోవుట వలన  మూత్రములో యూరోబిలినోజెన్ ఉండదు. మలము సుద్దరంగులో ఉంటుంది. పైత్య నాళములలో రాళ్ళు (Biliary stones), పైత్య నాళములలో పెరుగుదలలు (Growths), క్లోమములోని

209 ::