పుట:Hello Doctor Final Book.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

tion) చికిత్స అవసరము. కాలేయపుమార్పిడితో వ్యాధి నయమవుతుంది.

రక్తములో బిలిరుబిన్ (bilirubin) విలువ, రక్తములో క్రియటినిన్ విలువ (serum creatinine), రక్తపు ప్రోథ్రాంబిన్ కాలములతో (prothrombin time) అంత్యదశ కాలేయవ్యాధి నిర్ణయ సంఖ్య (model for end stage liver disease - MELD score) గణించి పరదాన కాలేయపు మార్పిడి చికిత్సకు  అర్హులైనవారిని  క్రమబద్ధీకరిస్తారు.

హృదయ, శ్వాసకోశవ్యాధుల వలన శస్త్రచికిత్సకు అనుకూలత లేనివారు, చర్మము గాక ఇతర అంగములలో  నయము కాని కర్కటవ్రణములు (cancers) ఉన్నవారు, మద్యపానము, యితర మాదకద్రవ్యముల వ్యసనములు కొనసాగిస్తున్నవారు పరదానకాలేయపు మార్పిడి శస్త్రచికిత్సకు అర్హులుగా పరిగణింప బడరు.

నారంగకాలేయవ్యాధి నివారణ :- మద్యపానము సలుపక పోవుట, లేక పరిమితము చేసుకొనుటవలన, కాలేయతాపము కలిగించు హెపటైటిస్ - బి విషజీవాంశములకు ( virus ) టీకాలు తీసుకొనుటవలన, హెపటైటిస్ - సి  సోకకుండా జాగ్రత్తలు తీసుకొనుట వలన, వివిధ కాలేయ తాపములకు చికిత్సలు చేయుట వలన, స్థూలకాయముు రాకుండా అవసరమైన కాలరీల ఆహారము తీసుకొని, వ్యాయామములు సలుపుట వలన, వంశపారంపర్య కాలేయ వ్యాధులు కనుగొనుటకు సకాలములో పరీక్షలు సలిపి తగిన చికిత్సలు చేయుట వలన, పెక్కు శాతము నారంగ కాలేయ వ్యాధులను అరికట్టవచ్చును.

205 ::