పుట:Hello Doctor Final Book.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చును. కొందఱికి రక్తశుద్ధి (dialysis) అవసరము పడవచ్చును. కాలేయ మూత్రాంగ వైఫల్యము తీవ్రమైన ఉపద్రవము. ప్రాణాపాయము తొలగించుటకు చాలామందికి పరదాన కాలేయమార్పిడి చికిత్స అవసరము. కాలేయ మతిభ్రంశము ( Hepatic Encephalopathy ):

కాలేయ మతిభ్రంశము కలిగినవారిలో (శరీర) ద్రవప్రమాణ లోపములు (hypovolemia), రక్తములో విద్యుద్వాహక లవణముల అసాధారణములు (electrolyte abnormalities), ఆమ్ల క్షార అసాధారణములు (acid - base disturbances) ఉంటే వాటికి చికిత్స చేసి సరిదిద్దాలి. వీరిలో అమోనియా ప్రమాణములు పెరిగి ఉంటాయి. వీరికి లాక్టులోజ్ (lactulose) దినమునకు రెండు మూడు విరేచనములు కలుగునట్లు మోతాదును సరిచేస్తూ ఇవ్వాలి. లాక్టులోజ్ తో పరిస్థితి మెరుగు కానివారికి జీర్ణమండలము నుంచి గ్రహింపబడని నియోమైసిన్ (neomycin), రిఫాక్సిమిన్ (rifaximin) వంటి సూక్ష్మజీవి నాశకములను (antibiotics) కూడా నోటి ద్వారా ఇస్తారు. పెద్దప్రేవులలో సూక్ష్మజీవుల సాంద్రత తగ్గించుట వలన అమ్మోనియా ఉత్పత్తి తగ్గుతుంది. కాలేయకణ కర్కటవ్రణములు ( hepatocellular carcinoma ) :

దీర్ఘకాల కాలేయతాప వ్యాధులు బి, సి లు ( Chronic hepatitis B and Chronic hepatitis C) కలవారిలో కాలేయకణ కర్కట వ్రణములు (Hepatocellular carcinomas) కలిగే అవకాశములు హెచ్చు. వాటిని త్వరగా కనుగొనుటకు వీరికి ప్రతి ఆరు మాసములకు శ్రవణాతీతధ్వని పరీక్షతో (ultrasonography) కాలేయమును పరీక్షిస్తూ ఉండాలి. పరకాలేయ దానము ( Liver transplantation ) :

అంత్యదశలో నారంగ కాలేయవ్యాధి  ఉండి, జలోదరము అధికమయి ఉపద్రవములకు దారితీస్తున్నవారికి, అన్నవాహిక ఉబ్బుసిరల నుంచి రక్త స్రావము కలుగుచున్నవారికి, కాలేయ మతిభ్రంశము కలిగేవారికి, నారంగ కాలేయవ్యాధితో బాటు కాలేయకణ కర్కటవ్రణము (hepatocellular carcinoma) ఉన్నవారికి పరకాలేయ దానము ( liver transplanta:: 204 ::