పుట:Hello Doctor Final Book.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వతః సూక్ష్మజీవ ఉదరవేష్ట న తాపము ( spontaneous bacterial peritonitis) :-

జలోదరము గలవారిలో సూక్ష్మజీవుల వలన ఉదరవేష్టన తాపము (Spontaneous Bacterial Peritonitis ) కలిగే అవకాశము ఉన్నది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా (streptococcus pneumoniae), ఎంటెరో బేక్టీరియేషియా (Enterobacteriaceae), ఎంటెరోకోక్సై (enterococcus) అనే సూక్ష్మజీవులు ఈ తాపమును సాధారణముగా కలుగజేస్తాయి. జలోదర ద్రవములో మాంసకృత్తులు 1 గ్రాము / డెసిలీటరు  కంటె తక్కువైనవారిలోను, అన్ననాళములోని ఉబ్బుసిరలనుంచి రక్తస్రావము కలిగేవారిలోను, అదివరకు సూక్ష్మజీవ ఉదరాంత్ర వేష్టన తాపము కలిగినవారిలోను ఈ తాపము కలిగే అవకాశము హెచ్చు. జలోదర ద్రవములో తెల్లకణముల సంఖ్య 250 / మైక్రోలీటరు కంటె ఎక్కువ ఉన్నవారిలో ఈ తాపము ఉన్నదని నిర్ణయించి వారికి సూక్ష్మజీవ నాశకములు (antibiotics) ఇవ్వాలి. ట్రైమిథాప్రిమ్ సల్ఫామిథాక్సజోల్ ( trimethoprim sulfamethoxazole), సిప్రోఫ్లోక్ససిన్ (ciprofloxacin), నార్ఫోక్ససిన్ (norfloxacin) లలో ఏదైనా వాడవచ్చు. కాలేయ మూత్రాంగ వై ఫల్యము ( Hepatorenal syndrome )

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో ద్వారసిర పీడనము హెచ్చయినవారిలోను (portal hypertension), తీవ్ర కాలేయవైఫల్యము (fulminant hepatic failure) గలవారిలోను, జీర్ణమండలములో రక్తస్రావము కలిగిన వారిలోను, సూక్ష్మజీవుల వలన ఉదరాంత్రవేష్టన తాపము (spontaneous bacterial peritonitis) వంటి  సూక్ష్మాంగజీవుల దాడులు (infections) కలిగినపుడు, జలోదరము గలవారిలో రక్తప్రమాణమును భర్తీ చేయకుండా (ఆల్బుమిన్ తో) అధిక ప్రమాణములలో జలోదర ద్రవమును తొలగించినపుడు, ఎక్కువగా మూత్రకారకములను వాడినపుడు, మూత్రాంగముల రక్తనాళములు సంకోచించుటచే మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గి మూత్రాంగవైఫల్యము కలుగగలదు. కాలేయ - మూత్రాంగవైఫల్యము సిరల ద్వారా ఆల్బుమిన్ ను, నారెడ్రినలిన్లను ఇచ్చినపుడు కొంత మెరుగు కనిపించ

203 ::