పుట:Hello Doctor Final Book.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Shunt - TIPS) సలుపుట వంటి ప్రక్రియలు ఉపయోగపడగలవు. రక్తమును ద్వారసిర (portal vein) నుంచి కాలేయ సిరకు (hepatic vein) మఱలించినపుడు ద్వారసిరలో పీడనము తగ్గి అన్ననాళములోని ఉబ్బు సిరలు సామాన్యస్థితికి వస్తాయి. జలోదరము ( Ascites ):-

జలోదరము కలిగిన వారిలో ఉప్పు (సోడియమ్ క్లోరైడు) వాడకమును దినమునకు 5 గ్రాములకు (సోడియమ్ 2 గ్రాములకు) పరిమితము చెయ్యాలి. వీరికి మూత్రకారకములను (diuretics) ఇచ్చి జలోదరము తగ్గించవచ్చును. స్పైరనోలాక్టోన్ (spironolactone) వంటి ఆల్డోష్టిరోన్ అవరోధకములను (aldosterone inhibitors), ఫ్యురొసిమైడ్ (furosemide) వంటి మూత్రనాళికల మెలిక భాగముపై పనిచేయు మూత్రకారకములతో (loop diuretics) కలిపి వాడితే సత్ఫలితములు కలుగుతాయి. మూత్ర కారకములను వాడునపుడు తఱచు రక్తపరీక్షలతో విద్యుద్వాహక లవణములను (electrolytes)  యూరియాను, క్రియటినిన్ ను పరిశీలిస్తూ ఉండాలి. జలోదరము అధికముగా ఉండి మూత్రకారకముల చికిత్సకు లొంగ నప్పుడు ఉదరకుహరములోనికి నాళిక చొప్పించి ఆ నాళిక ద్వారా జలోదర ద్రవమును తొలగించవచ్చును. 5 లీటర్లకు మించి ద్రవము తొలగించునపుడు సిరల ద్వారా ఆల్బుమిన్ ను ఎక్కించి రక్తప్రసరణ అస్థిరతను (hemodynamic instability), సోడియం హీనతను (hyponatremia), మూత్రాంగముల వ్యాపార క్షీణతను నిరోధించవచ్చును. జలోదరము ఎక్కువగా ఉన్నపుడు, అధిక ప్రమాణములలో ద్రవమును తొలగించుట సాధ్యము కానపుడు, కంఠసిర ద్వారా కాలేయములో ద్వారసిర (portal vein), కాలేయసిరల (hepatic vein) సంధానము (Transjugular intrahepatic porto systemic shunt - TIPS) అవసరము కావచ్చును. ఈ ప్రక్రియ వలన  కాలేయ మతిభ్రంశము (hepatic encephalopathy) కలిగే అవకాశము ఉన్నది.

202 ::