పుట:Hello Doctor Final Book.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయితే తగ్గించిన మోతాదులలో జాగరూకతతో వాడాలి. పోషక పదార్థములు :-

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో శరీరవ్యాపారము (metabolism) హెచ్చవుతుంది. వారికి తగిన పోషకపదార్థములు అందించాలి. తగినన్ని మాంసకృత్తులు, కాలరీలను అందించాలి. మద్యపానము సలిపేవారిలో ఫోలికామ్లము (folic acid), థయమిన్ (thiamine) లోపములు ఉంటాయి. వారికి వాటిని అందించి ఆ లోపములను సరిదిద్దాలి. జలోదరము కలవారు సోడియమ్ వాడుకను దినమునకు 2 గ్రాములకు (5 గ్రాముల ఉప్పుకు సమానము) పరిమితి చేసుకోవాలి. టీకాలు :-

కాలేయతాప విషజీవాంశములు ఎ, బి (hepatitis A, hepatitis B) లకు టీకాలు వేయాలి. వ్యాపకజ్వరము (Influenza), శ్వాసకోశ తాపములను (pneumonitis) అరికట్టుటకు కూడా టీకాలు అవసరము. కోవిడ్ కు టీకాలు కూడా వేయాలి. అన్నవాహికలోని ఉబ్బుసిరలకు చికిత్స :-

అన్నవాహికలో ఉబ్బుసిరలు (esophageal varices) నుంచి రక్తస్రావము అరికట్టుటకు బీటా ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు (beta adrenergic receptor blockers) - ప్రొప్రనలాల్ (propranolol), గాని నెడొలాల్ (nadolol) గాని వాడుతారు. విశ్రాంత హృదయవేగము (resting heart rate) 25 % తగ్గే వఱకు మోతాదును సరిచేయాలి. బీటా అవరోధకములు వాడలేనివారిలోను, వాటిని సహింపలేనివారిలోను, అంతర్దర్శిని ద్వారా ఆ ఉబ్బుసిరలకు పట్టీలు బంధించాలి (band ligation), లేక వాటిని తంతీకరణ రసాయనములతో (sclerosant agents) కఠినపరచాలి. ఈ చర్యలకు ఫలితములు లేక రక్తస్రావము మరల మరల సాగే వారిలో కంఠసిర ద్వారా కాలేయములో ద్వారసిర - కాలేయసిరల సంధానము (Transjugular Intrahepatic Portosystemic

201 ::