పుట:Hello Doctor Final Book.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

MRCP ) చిత్రీకరించి వాటిలో అసాధారణములను కనుగొనవచ్చును. కణపరీక్ష ( Histology ):-

కణపరీక్షతో నారంగ కాలేయవ్యాధిని నిర్ణయించవచ్చును. కాలేయ కణజాలమును చర్మము ద్వారా (transcutaneous) కాని, కంఠసిర మార్గముతో కాని (trans jugular), ఉదర దర్శనము (laparoscopy) ద్వారా గాని గ్రహించవచ్చును. ఈ ప్రక్రియలతో ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నది. అందువలన  రోగిని పరీక్షించుట వలన, ఇతర పరీక్షల వలన వ్యాధిని నిర్ణయించగలిగితే కణపరీక్షలు వైద్యులు చేయరు.

కణపరీక్షలలో తంతీకరణము (fibrosis), కాలేయకణములలో కొవ్వు చేరుట, వసతాపము (steatohepatitis), కాలేయకణ విధ్వంసము  తామ్రకాలేయము, అయవర్ణకవ్యాధి వంటి వ్యాధుల లక్షణములు కనిపిస్తాయి. జలోదర జల పరీక్ష:-

జలోదరము ఉన్న వారిలో ఉదరకుహరము (abdominal cavity) నుంచి లోహనాళిక ద్వారా ద్రవమును సేకరించి ఆ ద్రవమును తెల్లరక్త కణములకు (leukocyte count), మాంసకృత్తులకు, కర్కటవ్రణ కణములకు (malignant cells) పరీక్షించాలి. చికిత్స :-

నారంగ కాలేయవ్యాధి కలిగిన పిదప పోదు. వ్యాధి మూలకారణములకు చికిత్సచేయుట, వ్యాధి పురోగతిని అరికట్టుట, వ్యాధి వలన కలిగే ఉప ద్రవములను అరికట్టుట, ఉపద్రవములకు చికిత్స చేయుట, పరదాన కాలేయ మార్పిడికి  పరిశీలించుట వైద్యుల లక్ష్యములు. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులు మద్యపానము మానివేయాలి. ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ మందుల వాడకము తగ్గించాలి. కాలేయము ద్వారా విసర్జింపబడు ఇతర ఔషధములను, కాలేయకణములపై విష ప్రభావము గల ఔషధములను మానివేయాలి. వాటి వాడుక తప్పనిసరి

200 ::