పుట:Hello Doctor Final Book.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్షలు కూడా సలపాలి.

ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపము  కనిపెట్టుటకు దాని విలువలను తెలుసుకోవాలి. స్వయంప్రహరణ వ్యాధులను గుర్త ిం చుటకు AntiNuclear Antibodies -ANA, Anti Mitochondrial Antibodies, Anti Smooth muscle Antibodies, Anti LKM Antibodies పరీక్షలు చెయ్యాలి. శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణ (Ultrasonography) :-

శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణముతో  కాలేయపు ఆకారమును, కాలేయములో బుడిపిలు, కనుగొనగలము. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో కాలేయము నుంచి ప్రతిధ్వనిత్వము (echogenesis) హెచ్చుగా ఉంటుంది. ప్లీహ పరిమాణము పెరిగి ఉంటుంది (splenomegaly). ద్వారసిరలో (portal vein) వ్యాకోచ సంకోచములు (pulsations) కనిపిస్తాయి. ఉదరకుహరములో జలమును (జలోదరము) కూడా కనిపెట్ట గ లము. పైత్యనాళములలో అసాధారణములను కూడా గ్రహింపగలము. అన్నవాహిక, జఠరాంత్ర దర్శనము ( Esophago gastroduodenoscopy ) :-

నారంగ కాలేయవ్యాధిగ్రస్ల థు లో అన్నవాహిక, జఠరము, ప్రథమాంత్రము లను అంతర్దర్శినితో (endoscopy) పరీక్షించి అన్నవాహికలో ఉబ్బు సిరలను (esophageal varices) కనుగొని తగిన చికిత్స చెయ్యాలి. కాలేయ స్థితిస్థా పకత చిత్రీకరణ ( Hepatic elastography ):-

కాలేయ స్థితిస్థాపకతను (elasticity) వివిధ పరీక్షలతో చిత్రీకరించి నారంగ కాలేయవ్యాధిని (Cirrhosis of Liver) నిర్ధారించవచ్చును. పైత్య నాళములను (bile ducts), క్లోమ నాళములను (pancreatic ducts) అంతర్దర్శినులతో కాని అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములతో కాని ( Endoscopic Retrograde Cholangio PancreatographyERCP, Magnetic Resonance Cholangio Pancreatography:: 199 ::