పుట:Hello Doctor Final Book.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(AP & GGTP) పైత్యనాళముల అవరోధమును సూచిస్తాయి.

వ్యాధి ముదరక మునుపు రక్తద్రవములో బిలిరుబిన్ విలువలు పెరుగకపోయినా, వ్యాధితీవ్రత పెరిగినపుడు బిలిరుబిన్ విలువలు పెరుగుతాయి.

కాలేయములో ఆల్బుమిన్ (ఒక మాంసకృత్తి) ఉత్పత్తి తగ్గి రక్తములో ఆల్బుమిన్ విలువలు తగ్గుతాయి.

సూక్ష్మజీవుల ప్రతిజనకములు (bacterial  antigens) కాలేయములో విచ్ఛిన్నము పొందక రక్షణవ్యవస్థకు చేరుట వలన వాటికి ప్రతిరక్షకముల (antibodies) ఉత్పత్తి జరిగి గ్లాబ్యులిన్ల (globulins) విలువలు పెరుగుతాయి. కాలేయములో రక్తఘనీభవన అంశముల  (clotting factors) ఉత్పత్తి తగ్గుట వలన రక్తము నెమ్మదిగా గడ్డకడుతుంది. వ్యాధి తీవ్రత పెరిగినపుడు రక్తఘనీభవన వేగము సూచించు ప్రోథ్రాంబిన్ కాలము (Prothrombin Time PT) ఎక్కువగా ఉంటుంది.

ఆల్డోష్టిరోన్ (Aldosterone), మూత్ర పరిమాణము తగ్గించు ఏంటి డైయూరెటిక్ హార్మోనుల (anti diuretic hormone) ప్రభావము వలన మూత్రములో ఉప్పు కంటె నీరు తక్కువగా విసర్జింపబడి రక్తద్రవములో సోడియమ్ సాంద్రత (serum sodium) తగ్గి  సోడియం ప్రమాణములు తక్కువగా (Hyponatremia) ఉండవచ్చును. రక్తద్రవములో విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలను, యూరియా విలువలు, క్రియటినిన్ విలువలను గమనిస్తూ ఉండాలి. వీరికి  కాలేయ తాపములు బి, సి ( hepatitis - B, hepatitisC) వ్యాధుల పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చెయ్యాలి.

ఇనుము వర్ణక వ్యాధికై (hemochromatosis) రక్తద్రవములో, Ferritin,Transferrin saturation  లను పరీక్షించాలి. తామ్ర కాలేయవ్యాధిని (Wilson’s disease) గుర్త ిం చుటకు రక్త ద్ర వములో రాగి సాంద్రతకు, సెరులోప్లాస్మిన్ (ceruloplasmin) ప్రమాణములకు, మూత్రములో రాగి విలువలకు పరీక్షలు చెయ్యాలి. కంటి

198 ::