పుట:Hello Doctor Final Book.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరుగుటచే స్వీయసంరక్షణ తగ్గుట,  జ్ఞాపకశక్తి మందగించుట, ఏకాగ్రత లేకపోవుట, తత్తరపాటు, గజిబిజి, అపస్మారకములు కలుగుతాయి.  కాలేయవైఫల్యపు అంత్యదశలో అరచేతులు మణికట్టుకీళ్ళ వద్ద గబ్బిలం రెక్కల వలె కొట్టుకోవచ్చును (asterixis). కాలేయ మూత్రాంగ విఘాతము ( Hepatorenal syndrome ):-

నారంగ కాలేయవ్యాధిగ్రస్థులలో జలోదరము ఎక్కువగా ఉన్నపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాలేయవైఫల్యము తీవ్రమయినపుడు మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగవైఫల్యము (hepatorenal syndrome) కూడా కలిగే అవకాశము ఉన్నది.

నారంగ కాలేయవ్యాధిగ్రస్థులలో తెల్లనిగోళ్ళు, డోలుకఱ్ఱలవేళ్ళు (clubbing of fingers), బాహుమూలములలో వెండ్రుకల నష్టము, శ్రవణమూల లాలాజలగ్రంథుల (parotid salivary gland) వాపులు, అరచేతి  కండర ఆచ్ఛాదనములలో (palmar aponeurosis ; Palmar fascia) బొడిపెలు, సంకోచములు (Dupuytren ‘s contractures) వంటి లక్షణములు కూడా కనిపించవచ్చును. రక ్తపరీక్షలు :-

నారంగకాలేయవ్యాధి ప్రారంభదశలో రక్తపరీక్షలు వ్యాధిని పసిగట్టుటకు తోడ్పడుతాయి. వీరిలో ప్లీహము ఉద్రేకము (hypersplenism) వలన రక్తఫలకముల సంఖ్య (platelet count), రక్తములో తెల్లకణముల సంఖ్య (white blood corpuscles count) తగ్గి ఉంటాయి.

రక్తద్రవములో (serum) కాలేయ జీవోత్ప్రేరకముల (liver enzymes) విలువలు పెరుగుతాయి.  ఏస్పర్టేట్ ట్రాన్సెమినేజ్ (Aspartate transaminase - AST), విలువలు  ఏలనైన్ ట్రాన్సెమినేజ్ (Alanine transaminase  విలువలు కంటె ఎక్కువగా ఉంటాయి. ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ (alkaline phosphatase AP), గామా గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ (gamma glutamyil transferase GGTP) విలువలు పెరిగి ఉండవచ్చు. పెరిగిన ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ , గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ విలువలు

197 ::