పుట:Hello Doctor Final Book.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చును. కాలేయములో ఎష్ట్రెడియాల్ (estradiol) అనే స్త్రీ సంబంధ వినాళగ్రంథి స్రావకపు (hormone) విచ్ఛేదన తగ్గి రక్తములో దాని పరిమాణము పెరుగుతుంది. పెరిగిన ఎష్ట్రడియాల్ వలన అరచేతులలో ఎఱద ్ఱ నము (palmar erythema) కనబడుతుంది. చర్మముపై సాలీడు మచ్చలు (spider nevi) ఏర్పడుతాయి. ఈ మచ్చలమధ్య సూక్ష్మధమని ఉండి దాని చుట్టూ ఉబ్బిన కేశనాళికలు సాలీడు ఆకారములో ఉంటాయి. ఎష్ట్రడియాల్ ప్రభావము వలన పురుషులలో స్తనములు ఉబ్బుతాయి (gynecomastia). పురుషులలో వృషణముల క్షీణత, నపుంసకత్వము కలుగుతాయి. నారంగవ్యాధి తీవ్రత పెరిగినపుడు పచ్చకామెరలు పొడచూపుతాయి. బిలిరుబిన్ (bilirubin) వర్ణకపు విసర్జన తగ్గుటవలనను, కాలేయములో పైత్య నాళములలో పైత్యపు నిశ్చలత వలనను (biliary stasis) రక్తములో బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరలు కలుగుతాయి. వీరి చర్మము, నేత్ర శ్వేతపటలములలో ( sclera ) పచ్చదనము కనిపిస్తుంది. చర్మములో పైత్య లవణములు చేరుటచే దురద కలుగుతుంది.

కాలేయములో రక్తములోని అమ్మోనియా యూరియా గా విచ్ఛిన్న మవుతుంది. కాలేయ వ్యాపారము తగ్గినపుడు అమ్మోనియా విచ్ఛేదన తగ్గి అమ్మోనియా విలువలు పెరుగుతాయి. రక్తములో అమ్మోనియా విలువలు, ఇతర వ్యర్థ పదార్థములు పెరుగుట వలన మతిభ్రంశము కలుగగలదు.

రక్తములో డైమిథైల్ సల్ఫైడ్ (dimethyl sulfide) విలువలు పెరుగుతే శ్వాసలో దుర్వాసన (fetor hepaticus) ఉంటుంది.  రక్త ఘనీభవన అంశములు (clotting factors) కాలేయములో ఉత్పత్తి అవుతాయి. కాలేయ వ్యాపారము బాగా మందగించినపుడు రక్తఘనీభవన అంశముల లోపము కలిగి వీరిలో రక్తస్రావములు జరుగవచ్చును. చర్మములోను చర్మము క్రింద  సూక్ష్మ రక్తనాళికల నుంచి రక్తము స్రవించి కమలవచ్చును. వీరిలో prothrombin time ఎక్కువగా ఉంటుంది. కాలేయ మతిభ్రంశము ( hepatic encephalopathy ) :-

అంత్యదశలో రక్తములో అమ్మోనియా, ఇతర విషపదార్థములు

196 ::