పుట:Hello Doctor Final Book.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరిగిన ప్లీహములో  తెల్లరక్తకణములు (white blood corpuscles), రక్తఫలకములు (platelets) అధికముగా విధ్వంసము చెందుట వలన వీరి రక్తములో తెల్లకణముల సంఖ్య, రక్తఫలకముల సంఖ్య తగ్గుతుంది అన్ననాళములో ఉబ్బుసిరలు ( Esophageal varices) :-

జీర్ణాశయ సిరలలో పీడనము పెరిగి వాటిలోని రక్తము అన్ననాళపు (esophagus)  సిరలకు మరలింపబడుట వలన అన్ననాళపు సిరలు ఉబ్బుతాయి. ఈ ఉబ్బిన సిరలు చిట్లి రక్తస్రావము జరిగితే  రక్తవమనము (hematemesis) కలుగుతుంది. అన్ననాళములోనికి రక్తము స్రవించి జీర్ణాశయములో ఆమ్లముతోను, ప్రేవులలో క్షారముతోను కలియుటచే నల్ల విరేచనముల (melena) విసర్జన జరుగుతుంది. అన్నవాహిక ఉబ్బుసిరల (esophageal varices) నుంచి రక్తస్రావము అధికమయితే ప్రాణాపాయము కాగలదు. ఉదరకుడ్యములో ఉబ్బు సిరలు ( Caput medusa) :-

జీర్ణమండలపు సిరలలో పీడనము పెరిగి రక్తము ఉదరకుడ్యపు (abdominal wall) సిరలకు  మళ్ళుట వలన కడుపులో చర్మము క్రింద సిరలు పెద్దవయి బొడ్డు చుట్టూ నీలవర్ణములో  కనిపిస్తాయి. జలోదరము ( Ascites ) :-

ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట వలనను, కాలేయకణ వ్యాపారము మందగించి ఆల్బుమిన్ అను మాంసకృత్తి ఉత్పత్తి తగ్గి రక్తపు రసాకర్షణ పీడనము (osmotic pressure) తగ్గుట వలనను ఉదరకుహరములో (abdominal cavity) నీరుపట్టవచ్చును. అపుడు వీరి ఉదర పరిమాణము పెరిగి కడుపులో నిండుతనము (bloating) కలుగుతుంది. వీళ్ళలో కాళ్ళ పొంగులు కూడా పొడచూపుతాయి. దేహములో లవణ ప్రమాణము, జలప్రమాణము పెరుగుటచే వీరి బరువు పెరుగుతుంది. జలోదరము బాగా ఎక్కువయినపుడు ఆయాసము కలుగుతుంది. కాలేయకణ నష్టము వలన కాలేయవ్యాపారము మందగిస్తుంది. ప్రారంభములో వీరికి నీరసము, ఆకలి తగ్గుట, బరువు తగ్గుట కనిపించ

195 ::