పుట:Hello Doctor Final Book.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాపముగా (Chronic hepatitis) కొనసాగి ఆపై నారంగ కాలేయవ్యాధిగా పరిణమిస్తుంది. ప్రపంచములో సుమారు 55 శాతపు  నారంగ కాలేయవ్యాధులు విషజీవాంశముల వలన కలుగుతాయి. మద్యేతర వస కాలేయ తాపము (nonalcoholic steatohepatitis) :-

మద్యపానము సలుపనివారిలో కూడా కాలేయకణములలో కొవ్వు ఎక్కువగా చేరినపుడు దీర్ఘకాలిక కాలేయతాపము (nonalcoholic steatohepatitis) కలిగి ఆపై అది నారంగ కాలేయవ్యాధిగా పరిణమించవచ్చును. స్థూలకాయము కలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను (diabetes mellites), రక్తములో కొవ్వుపదార్థములు (cholesterol and Triglycerides) హెచ్చుగా ఉన్నవారిలోను, కాలేయ కణములలో కొవ్వు చేరి తాపము కలిగించగలదు. కణవిధ్వంసము పిదప పీచుకణముల (fibroblasts), కాలేయ నక్షత్రాకార కణముల (hepatic stellate cells) చైతన్యము వలన పీచుపదార్థము ఏర్పడి (fibrosis) నారంగ కాలేయవ్యాధిగా రూపొందే అవకాశము ఉన్నది. ప్రాథమిక పై త్య నారంగవ్యాధి ( Primary biliary cirrhosis ) :-

ఇది స్వయంప్రహరణ వ్యాధి (autoimmune disease). సాధారణముగా 50 సంవత్సరాల స్త్రీలలో ఈ వ్యాధి కలుగుతుంది. వీరిలో మైటోఖాండ్రియాలపై పనిచేయు ప్రతిరక్షకములు ( Anti Mitochondrial Antibodies ) ఉంటాయి. ప్రాథమిక పై త్యనాళిక కాఠిన్య తాపము ( Primary sclerosing cholangitis ) :-

ఈ అరుదైన వ్యాధి ఎక్కువగా ఐరోపాఖండ ఉత్తరభాగములో నివసించు వారిలోను, వారి వంశజులలోను 20 - 40 సంవత్సరముల ప్రాయములో కనిపిస్తుంది. వీరి పైత్యనాళికలలో తాపము (inflammation), తంతీకరణము (fibrosis), కాఠిన్యతలు (sclerosis) కలిగి పైత్య ప్రవాహమునకు అవరోధము కలుగుటచే నారంగ కాలేయవ్యాధి కలుగుతుంది. వీరిలో ఆంత్రతాప వ్యాధులు ( Inflammatory bowel diseases) కూడా తఱచు కలుగుతాయి.

192 ::