పుట:Hello Doctor Final Book.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. నారంగ కాలేయవ్యాధి (Cirrhosis of Liver)  కాలేయములో కాలేయకణముల విధ్వంసము, కొత్తకణముల పునరుత్పత్తి, కణముల విధ్వంసము పిదప తంతుకణములచే ( fibroblasts) తంతీకరణము (పీచువంటి పదార్థము ఏర్పడుట ; fibrosis) జరుగుట వలన కాలేయములో బుడిపెలు (nodules) ఏర్పడి నారంగ కాలేయవ్యాధికి (Cirrhosis) దారితీస్తాయి. ఈ వ్యాధి అంతిమదశలలో కాలేయ వ్యాపారము ఎక్కువగా క్షీణించి పచ్చకామెరలు కలుగుట వలన దేహము, కాలేయము కూడా నారింజపండు వర్ణములో ఉంటాయి. అందువలన ఈ వ్యాధి నారంగ కాలేయవ్యాధిగా (cirrhosis of liver ; Greek kirrh(s) orangetawny + - osis) పేరు పొందింది .

నారంగ కాలేయవ్యాధి దీర్ఘకాలపు వ్యాధి. ఆరంభదశలో లక్షణములు కనిపించవు కాని వ్యాధి ముదిరిన పిదప కాలేయ వ్యాపారము మందగించుట వలన, ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట (portal vein hypertension)

190 ::