పుట:Hello Doctor Final Book.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తస్రావమును అరికట్టలేని సందర్భములలోనే అఱుదుగా శస్త్రచికిత్సలు జరుగుతాయి.

వ్రణములనుంచి రక్తస్రావము జరిగితే అంతర్దర్శిని (endoscope) ద్వారా విద్యుద్దహనీకరణము (electric cauterization), సూచికతో ఎపినెఫ్రిన్ చికిత్స (injection therapy using epinephrine) వంటి ప్రక్రియలతో రక్తస్రావమును అరికట్టే అవకాశములు ఉన్నవి. పరరక్త దానము (blood transfusion) కూడా అవసరము అవవచ్చును. ఈ ప్రక్రియలకు లొంగకపోతే శస్త్రచికిత్స అవసరము. జఠరనిర్గమన సంకీర్ణత (ఆంత్రముఖ సంకీర్ణత ; Pyloric stenosis)

అంతర్దర్శిని ద్వారా బుడగతో ఆంత్రముఖమును (pylorus) వ్యాకోచింప

జేయవచ్చును. సంకీర్ణత తీవ్రమయితే జఠర ఆంత్ర సంధానము (Gastro jejunostomy) వంటి శస్త్రచికిత్సలు అవసరము. జీర్ణవ్రణముల నివారణ :-

హెలికోబాక్టర్ పైలొరై ని నిర్మూలించుట, స్టీరాయిడులు కాని తాపహరముల వాడుక తగ్గించుకొనుట, వాటి వాడుక తప్పనిసరి అయితే ప్రోటానుయంత్ర అవరోధకములను, హెచ్-2 అవరోధకములను వాడుకొనుట, ధూమపానము సలుపకపోవుట జీర్ణవ్రణములను నివారించుటకు సహాయ పడుతాయి.

189 ::