పుట:Hello Doctor Final Book.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Famotidine), నైజటిడిన్ (Nizatidine) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు.

ఆమ్ల హరములు (Antacids); మృదు క్షారములు సత్వర ఉపశమునకు ఉపయోగపడుతాయి. కాని వ్రణముల చికిత్సకు ప్రోటానుయంత్ర నిరోధకములు కాని, హిస్టమిన్ -2 గ్రాహక అవరోధకములను గాని వాడాలి.

హెలికోబాక్టర్ నిర్మూలనకు ప్రోటానుయంత్ర అవరోధకములతో బాటు సూక్ష్మజీవినాశకములు (Antibiotics) రెండైనా కలిపి వాడాలి. ఎమాక్సిసిలిన్, మెట్రానిడజాల్, క్లెరిథ్రోమైసిన్, పెప్టోబిస్మాల్, టెట్రాసైక్లిన్ లతో వివిధ మేళనములు లభ్యము.

సుక్రాల్ఫేట్ (Sucralfate) వ్రణములపై పూతగా ఏర్పడి వ్రణములపై జఠరికామ్లపు ప్రభావమును తొలగిస్తుంది. జీర్ణవ్రణముల మానుదలకు యీ ఔషధము ఉపయోగకారే.

స్టీరాయిడులు కాని తాపహరములను (NSAIDS) మానివేయాలి. ఏస్పిరిన్ కూడా అవకాశము ఉంటే (హృద్ధమని వ్యాధులు గలవారిలో జాగ్రత్త అవసరము.) మానివేయుట వ్రణముల మానుదలకు దోహదకారి. కార్టికోస్టీ రాయిడులను కూడా వీలయితే క్రమేణా తగ్గించుకొని మానివేయాలి. ధూమపానము చేసే వారిలో జీర్ణ వ్రణముల మానుదల మందగిస్తుంది. పొగత్రాగే వారిలో కడుపులో పుండ్లు ఎక్కువగా కలుగుతాయి. అందువలన పొగత్రాగుట మానివేయాలి. శస్త్రచికిత్సలు :-

మొదటి హిస్టమిన్ -2 అవరోధకము సైమెటిడిన్ కనుగొనక ముందు ఆమ్లహరములకు (antacids) లొంగని జీర్ణవ్రణములకు శస్త్రచికిత్సలు విరివిగా చేసేవారు. ఆమ్లపు ఉత్పత్తిని తగ్గించుటకు  వేగస్ నాడుల విచ్ఛేదన + జఠర, ఆంత్ర సంధానము (Vagotomy + Gastrojejunostomy) పాక్షిక జఠర విచ్ఛేదన, (Partial gastrectomy) వంటి శస్త్రచికిత్సలే వ్యాధిగ్రస్థులకు శరణ్యము అయేవి. ఈ దినములలో జటిలతరమైన వ్రణములకు,

188 ::