పుట:Hello Doctor Final Book.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుగొనవచ్చును. కాని ఈ పరీక్షలో చిన్న చిన్న వ్రణములు, జఠరతాపము (Gastritis), ఒరిపిడులు (gastric erosions) కనుగొనుట సాధ్యము కాదు. కణపరీక్షలకు అవకాశము ఉండదు. బేరియం పరీక్షలు అంతర్దర్శన పరీక్షలు లభ్యమయ్యాక చాలా తగ్గిపోయాయి. హెలికోబాక్టర్ పై లొరై పరీక్షలు:-

రక్తమును హెలికోబాక్టర్ పైలొరై ప్రతిరక్షకములకు (antibodies) పరీక్షించవచ్చును. కాని సూక్షాంగజీవులను నిర్మూలించిన 18 మాసముల వఱకు ఈ ప్రతిరక్షకములు రక్తములో ఉండవచ్చును. ప్రస్తుత సమయములో హెలికోబాక్టర్ పైలొరై సూక్ష్మాంగజీవులు సజీవముగా జఠరములో ఉన్నట్లు యీ పరీక్షతో నిర్ధారించజాలము. రేడియో ధార్మిక కార్బను గల యూరియా శ్వాసపరీక్షతో (Carbon labeled urea breath test) హెచ్. పైలొరైని నిర్ధారించవచ్చును. మలములో హెలికోబాక్టర్ సంబంధ ప్రతిజనకములు (antigens) కనుగొని హెచ్. పైలొరై ని నిర్ధారించవచ్చును. చికిత్స :-

జఠరామ్లమును అణచివేయుట చికిత్సలో మూలభాగము. ప్రోటాను యంత్ర అవరోధకములు (proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని స్రావమును అణచివేస్తాయి. ఆమ్లము అంటే ఉదజనే. ఒమిప్రజోల్ (Omeprazole) లాన్సప్రజోల్ (Lansoprazole), పాన్టొప్రజోల్ (Pantoprazole) ప్రోటానుయంత్ర అవరోధకములకు ఉదహరణములు.

హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( Histamine -2 receptor blockers) జఠరకణములపై హిస్టమిన్ ప్రభావమును అరికట్టి ఉదజహరికామ్ల స్రావమును అణచివేస్తాయి. సైమెటిడిన్ (Cimetidine), రెనెటిడిన్ (Ranitidine) ఫెమొటిడిన్

187 ::