పుట:Hello Doctor Final Book.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తస్రావము కలిగేవారిలో రక్తపు వాంతులు కలుగవచ్చును. వాంతులు కాఫీగుండ రంగులో ఉండవచ్చును. వారి విరేచనములో రక్తము కనిపించవచ్చు, లేక తారు వలె నల్లటి విరేచనములు కలుగవచ్చును. నెమ్మదిగా పెక్కుదినములు రక్తస్రావము జరిగినవారిలో పాండురోగము (anemia) ఉంటుంది. అధిక రక్తస్రావము వలన రక్తపీడనము పడిపోవచ్చును.

జఠర నిర్గమన సంకీర్ణత (ఆంత్రముఖ సంకీర్ణత :  Pyloric stenosis) కలుగుతే జఠరమునుంచి ఆంత్రము లోనికి ఆహార గమనము మందగిస్తుంది. తక్కువ తినగానే కడుపు నిండుట, కడుపులో బరువుగా అనిపించుట, పుల్లతేనుపులు, వాంతులు, వాంతులలో ముందు దినాలు తిన్న పదార్థములు ఉండుట, శరీరము చిక్కి బరువు తగ్గుట కలుగుతాయి.

ప్రధమాంత్రములో చిల్లు పడిన వారిలో ( ఆంత్ర ఛిద్రము ; Duodenal perforation) ఆకస్మికముగా భరించలేని విపరీతమయిన కడుపునొప్పి కలుగుతుంది. వీరికి అత్యవసర శస్త్రచికిత్స అవసరము. అత్యవసర శస్త్రచికిత్స చేయకపోతే వారికి ప్రాణాపాయము కలిగే అవకాశములు చాలా ఎక్కువ. రోగనిర్ణయ పరీక్షలు :-

రక్తహీనము(Anemia), రక్తస్రావము(bleeding), తక్కువ తిండితో ఆకలి తీరుట, బరువు తగ్గుట, ఎడతెఱపి లేకుండా వాంతులు, ఎగువ కడుపులో పెరుగుదల (growth), ఆమ్లము తగ్గించే మందులతో ఉపశమనము లేకపోవుట వంటి అపాయకర సూచనలు కలవారికి అన్ననాళ - జఠర ఆంత్రదర్శన (Esophagogastroduodenoscopy) సత్వరమే చేయాలి. దీనితో జీర్ణ వ్రణములను కనిపెట్టడమే కాక వ్రణము నుంచి చిన్న తునకలను కణపరీక్షకు, హెలికోబాక్టరు పైలొరై పరీక్షకు గ్రహించవచ్చు. కర్కటవ్రణములను (cancers ) త్వరగా కనిపెట్టవచ్చు. అన్ననాళ - జఠర - ఆంత్రదర్శన పరీక్షలో అన్ననాళమును, జీర్ణాశయమును, ప్రథమాంత్రమును శోధించి కడుపులో పుళ్ళను నిర్ధారించ వచ్చును. ఈ పరీక్ష ప్రామాణిక పరీక్ష.

బేరియం ద్రవమును త్రాగించి ఎక్స్ - రే ల ద్వారా జీర్ణ వ్రణములను

186 ::