పుట:Hello Doctor Final Book.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8) 9)

జీర్ణాశయములో కలిగే కర్కటవ్రణములు (Gastric cancers), లింఫోమాలు వ్రణములుగా కనిపించవచ్చును.

పొగాకు వినియోగించే వారిలో జీర్ణవ్రణములు ఎక్కువగా కలుగతాయి.

కారము, మసాలాలు తినుటవలన, జీవితములో కలిగే మనోక్లేశమువలన, తొందఱవలన యీ జీర్ణ వ్రణములు కలుగవు. అట్టి ఆరోపణలు నిజము కాదు. జీర్ణవ్రణ లక్షణములు

కడుపులో పుళ్ళున్న వారిలో చాలా మందికి కడుపు నొప్పి ఉంటుంది. అన్ననాళములో పుళ్ళున్న వారిలో భోజనము మ్రింగుతున్నపుడు, జఠరాశయము లో పుళ్ళున్నవారిలో తిన్న వెంటనే, ప్రథమాంత్రములో (duodenum) వ్రణములు ఉన్నవారిలో భోజనము చేసిన గంట, గంటన్నర పిదప యీ నొప్పి సాధారణముగా కలుగుతుంది. జఠరవ్రణములు ఉన్నవారిలో పొట్ట పై భాగములో నొప్పి సాధారణముగా కలుగుతుంది. ప్రథమాంత్రములో పుండున్న వారికి ఏమైనా తిన్న వెంటనే కొంత ఉపశమనము తాత్కాలికముగా కలుగుతుంది. ఈ వ్రణములు ఉన్నవారిలో కుక్షి పై భాగములో తాకుతే నొప్పి కలుగవచ్చును. మృదు క్షారములు (Antacids) ఆమ్లమును బలహీనపఱచి తాత్కాలిక ఉపశమనము కలిగిస్తాయి.

కడుపు నొప్పి ఉన్న వారందరిలో యీ వ్రణములు ఉన్నాయని చెప్పలేము. వారి నొప్పికి యితర కారణాలు ఉండవచ్చును. జీర్ణవ్రణములు గల అందరిలో నొప్పి ఉండకపోవచ్చును. కొందఱిలో జీర్ణవ్రణముల వలన కలిగే ఉపద్రవముల లక్షణములే తొలిసారిగా కనిపించవచ్చును. ఉపద్రవములు ( Complications ) :-

రక్తస్రావము (bleeding), జఠరనిర్గమన బంధము ( Pyloric stenosis), ఆంత్రములో రంధ్రము ఏర్పడుట (ఆంత్ర ఛిద్రము - perforation), జీర్ణవ్రణముల వలన కలిగే ప్రమాదాలు.

185 ::