పుట:Hello Doctor Final Book.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2)

3) 4) 5)

6) 7)

జఠరములో హెలికోబాక్టర్ సూక్ష్మాంగజీవులు ఉన్నవారిలో ఇరువది శాతపు ప్రజలలో యీ వ్రణములు కలుగుతాయి. హెలికోబాక్టర్ సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, నీటిద్వారా జఠరమునకు చేరుతాయి. జఠరములో శ్లేష్మమును చొచ్చుకొని కణములకు దగర ్గ యి ఆమ్ల ము నకు దూరమయి తమ చుట్టూ యూరియేజ్ అనే జీవోత్ప్రేరకముతో అమ్మోనియాను ఉత్పత్తి చేసుకొని జఠరామ్ల ము బారి నుంచి తప్పించుకుంటాయి.

కీళ్ళనొప్పులకు వాడే స్టీరాయిడులు కాని తాపహరములు (Nonsteroidal anti inflammatory agents NSAIDS) దీర్ఘకాలము వాడే వారిలో 15 నుంచి 25 శాతపు ప్రజలలో యీ కురుపులు రావచ్చును. ఐబుప్రొఫెన్ (Ibuprofen), నేప్రొక్సిన్ (Naproxen), డైక్లొఫెనెక్ (Diclofenec), ఇండోమిథసిన్ (Indomethacin ), మెలోక్సికమ్ (Meloxicam), సేలిసిలేట్లు (Salicylates) NSAIDS కి ఉదహరణలు.

గుండెపోటులు (heart attacks), మస్థిష్క విఘాతాలను (strokes) అరికట్టుటకు వాడే ఏస్పిరిన్ వలన యీ వ్రణములు కలుగవచ్చును. స్టీరాయిడ్ ఔషధములు దీర్ఘకాలముగా వాడేవారిలో యీ కురుపులు రావచ్చును.

క్లోమములో కాని యితర ప్రదేశములలో కాని కలిగే గాస్ట్రినోమా (Gastrinoma) అనే పెరుగుదలల వలన రక్తములో గాస్ట్రిన్ ఎక్కువయి దాని మూలముగా ఉదజహరికామ్లము, పెప్సిన్ ఉత్పత్తి అధికమయి వారిలో యీ వ్రణములు కలుగుతాయి. సుమారు ఒక శాతపు జీర్ణ వ్రణములకు గాస్ట్రినోమాలు కారణము. తీవ్రతరమైన యితర అనారోగ్యములతో ఉన్నవారిలోను, కృత్రిమశ్వాస యంత్రములపై ఉన్నవారిలోను యీ వ్రణములు రావచ్చును.

కొందఱిలో తెలియని కారణాల (Idiopathic) వలన జీర్ణ వ్రణములు కలుగుతాయి.

184 ::