పుట:Hello Doctor Final Book.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) :

జఠరరసము (Gastric juice) ఆహారమును జీర్ణించుట కొఱకు ఉత్పత్తి అవుతుంది. జఠరరసములో ఉండే పెప్సినోజెన్, ఉదజహరికామ్లముల ఫలితముగా జీర్ణమండలపు లోపొర (శ్లేష్మపు పొర Mucosa) జీర్ణమయి వ్రణములు కలిగే అవకాశము ఉన్నది. ఈ జీర్ణవ్రణములు జఠరాశయములోను (Stomach), ప్రథమ ఆంత్రములోను (Duodenum), అన్ననాళములోను (Esophagus) అంతిమ ఆంత్రములో (Ileum) అవశేషముగా మిగిలే మెకెల్ సంచిలోను (Meckel ‘s diverticulum) కాని కలుగవచ్చును. ఉదజహరికామ్లము ఎక్కువగా ఉత్పత్తి అయినా, లో శ్లేష్మపుపొర నిరోధక శక్తి తగ్గి నా యీ పుళ్ళు కలుగుతాయి. జఠరముతో సంధించబడిన ఆంత్రములోను యీ వ్రణములు (సంధాన వ్రణములు; Anastomotic ulcers ) కలుగవచ్చును .

జీర్ణ వ్రణములకు కారణములు 1)

హెలికోబాక్టర్ పైలొరై ( Helicobacter pylori ) అనే సూక్ష్మాంగ జీవుల వలన ఏభై శాతపు జీర్ణవ్రణములు కలుగుతాయి. మూడవ ప్రపంచ దేశములలో యీ శాతము డెబ్భై వఱకు ఉండవచ్చును.

183 ::