పుట:Hello Doctor Final Book.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- Mucosa) ఉన్న జఠరగ్రంథుల నుంచి శ్లేష్మము (Mucus), ఉదజ హరికామ్లము (Hydrochloric acid), పెప్సినోజెన్, విటమిను బి 12 గ్రహణమునకు ఉపయోగపడే అంతరాంశము (B12 Intrinsic factor), గాస్ట్రిన్ (Gastrin) అనే వినాళరసము, హిస్టమిన్ లు(Histamine) ఉత్పత్తి అవుతాయి. ఇందులో శ్లేష్మము జఠరపు లోపొరకు రక్షణ చేకూరుస్తుంది. ఆహారచలనమునకు తోడ్పడుతుంది.

పెప్సినోజెన్ నుంచి విడుదల అయే పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమునకు ఉపయోగపడుతుంది. పెప్సిన్ ఆమ్ల మాధ్యమములో బాగా పనిచేస్తుంది. పి హెచ్ ఎక్కువయిన క్షారద్రవములలో పనిచేయదు. ఉదజహరికామ్ల ము సూక్ష్మాంగజీవులను సంహరించుటకు, పెప్సిన్ సలిపే జీర్ణ క్రి యకు దోహదకారిగాను ఉపయోగపడుతుంది.

అంతిమకుహరము (Antrum) ఆహారముతో ఉబ్బినపుడు, జఠరములో పి.హెచ్ పెరిగి ఆమ్లము తగ్గినపుడు జి కణములు (G- cells) గాస్ట్రిన్ ని ఉత్పాదించి రక్తములోనికి విడుదల చేస్తాయి. గాస్ట్రిన్ ఉదజహరికామ్లము, పెప్సిన్ ల విడుదలకు, జఠరకండరములను ప్రేరేపించి జఠరచలనము పెంచుటకు తోడ్పడుతుంది. జీర్ణాశయములో ఆమ్లము ఎక్కువయి నప్పుడు గాస్ట్రిన్ విడుదల తగ్గిపోతుంది. గాస్ట్రిన్ ఎంటెరోక్రోమఫిన్ (Enterochromaffin cells) కణములనుంచి హిస్ట మి న్ ని విడుదల చేయిస్త ుం ది. హిస్ట మి న్ జఠరకుడ్య కణములలో (parietal cells) ఉండే ప్రోటాను యంత్రముల (Proton pumps - Hydrogen / Potassium Adenosine triphoshatase Enzyme System) ద్వారా రక్తము లోనికి బైకార్బొనేట్ ను, జఠరకుహరములోనికి ఉదజనిని (Hydrogen- ప్రోటాన్లు) విడుదల చేయిస్తుంది. ఉదజనిని అనుసరించి క్లోరైడు పరమాణువులు కూడా జఠరకుహరములోనికి విడుదల అవుతాయి. మెదడు నుంచి వచ్చే వేగస్ కపాలనాడులు (Vagal nerves) కూడా ఆహారపు తలపు, వాసన, రుచులకు స్పందించి జఠరములో ఉదజహరికామ్లము, పెప్సినోజెన్ ల విడుదలను, గాష్ట్రిన్ విడుదలను కలిగిస్తాయి.

182 ::