పుట:Hello Doctor Final Book.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మయినపుడు కొందఱికి అనుకూలము కావచ్చును. వ్యాధి ఉద్రేకత (Acute exacerbations of COPD) :-

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి లక్షణములు అధికమయి ఆయాసము, దగ్గు అధికమయినపుడు వైద్యాలయములలో చేరిక అవసరము అవవచ్చును. సూక్ష్మాంగజీవులు (bacteria), విషజీవాంశములు (viruses), తాపజనకములు, వాతావరణ కల్మషముల వలన వ్యాధి ఉద్రేకించవచ్చును. అట్టి పరిస్థితులలో తఱచు పుపుస, శ్వాసనాళిక వ్యాకోచకములను (bronchodilators) అందించుటతో పాటు, సూక్ష్మజీవి నాశకములు (Antibiotics), కార్టికోస్టీరాయిడులు, ప్రాణవాయువులతో కూడా చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతరమయితే ధమని రక్తమును వాయువులకు పరీక్షించి శ్వాసవైఫల్యము నిర్ధారణ అయితే కృత్రిమ శ్వాసలు అందించాలి. వ్యాధి నివారణ :-

దీర్ఘకాలిక శ్వాస అవరోధమునకు పొగత్రాగుట అధిక శాతములో

ప్రధాన కారణము. కావున వ్యాధిని నివారించాలన్నా అదుపులో ఉంచాలన్నా పొగత్రాగడము మానివేయుట చాలా ముఖ్యము. ఒక యత్నములో చాలా మంది పొగత్రాగుట మానలేరు. అందువలన పదే పదే పొగత్రాగుట మానుటకు యత్నించాలి. సలహా సహాయములు తీసుకోవాలి. అవసరము అనుకుంటే ధూమపానము మానుటకు మందులు ఉపయోగించవచ్చును. బొగ్గుగనులు, యితరగనులలో గాలి ప్రసరణ పెంచి, గాలిలో కల్మషములను, ధూళిని తొలగించి, కార్మికులకు పరిశుభ్రమైన గాలిని ముక్కు, నోటిపై అమరు మూతల (masks) ద్వారా అందించి నల్ల ఊపిరితిత్తుల వ్యాధిని (Black lung disease) అరికట్టే ప్రయత్నాలు చెయ్యాలి.

180 ::