పుట:Hello Doctor Final Book.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూర్ఛ దీని వలన కలిగే అవాంఛిత ఫలితములు. థియాఫిలిన్ వాడేవారిలో మధ్యమధ్యలో రక్తప్రమాణములను పరీక్షించాలి. కార్టి కోష్టీ రాయిడులు ( Corticosteroids ) :-

నోటిద్వారా గాని సిరలద్వారా గాని కార్టికోస్టీరాయిడులను వ్యాధి ఉద్రేకించినపుడు, తీవ్రతరమయినపుడు తాత్కాలికముగాను వీలయినంత తక్కువ మోతాదులలోను వాడుతారు. Alpha - 1 Antitrypsin లోపించినవారిలో దానిని వారమునకు ఒకసారి సిరలద్వారా యిస్తే ప్రయోజనము చేకూరుతుంది. ప్రాణవాయువు (oxygen):-

ధమని రక్తపు ప్రాణవాయువు సంపృక్తత (oxygen saturation) 88 శాతముకంటె తక్కువయిన వారికి ప్రాణవాయువును ముక్కు గొట్టముద్వారా అందించాలి.

రక్తములో బొగ్గుపులుసువాయువు ప్రమాణము పెరిగిన వారికి, శ్వాసవైఫల్యము ప్రారంభదశలో ఉన్నవారికి నిరంతర పీడనముతో గాని (Continual Positive airway pressure  CPAP), ఉచ్ఛ్వాస నిశ్వాసములలో పీడనము మార్చి గాని (Bilevel positive airway pressure BiPAP) ప్రాణవాయువును ముక్కుపై కప్పుతో (mask) నిద్రలో ఉన్నపుడు, అవసరమయితే పగలు కొన్ని గంటలు అందిస్తారు. ఊపిరితిత్తు ల పరిమాణము తగ్గ ించే శస్త్రచికిత్స:(Lung Volume Reduction Surgery)

వాయువుల మార్పిడికి దోహదపడకుండా, పనిచేసే ఊపిరితిత్తుల భాగముల మీద పీడనము పెట్టి ఊపిరికి అంతరాయము కలిగించే ఉబ్బుదల భాగములను తొలగించు శస్త్రచికిత్స కొందఱికి ఉపయోగపడవచ్చును.

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స (Lung Transplantation surgery) FEV-1 20 శాతము కంటె తక్కువగా ఉండి వ్యాధి తీవ్రతమ

179 ::