పుట:Hello Doctor Final Book.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినమునకు 2 పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక 0.5 మి.గ్రా.లు ప్రతి 6-8 గంటలకు శీకరయంత్రము ద్వారా గాని వాడాలి.

సాల్మెటరాల్ (Salmeterol), ఫార్మెటరాల్ (Formoterol), దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను (Long Acting Beta Agonists  LABAs) విడిగా గాని, కార్టీకోస్టీరాయిడులతో (Fluticasone or Mometasone) కలిపి గాని పీల్పువులుగా ఉపయోగించవచ్చును. ఒలొడటెరాల్ (Olodaterol) రోజుకు రెండు పీల్పులుగా వాడాలి.

టియోట్రోపియమ్ (Tiotropium) దీర్ఘకాలిక ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము (Long acting Muscarine Antagonist LAMA). దీనిని దినమునకు రెండు పీల్పులుగా వాడాలి. దీర్ఘకాలిక బీటా ఉత్తేజకము ఓలొడటెరాల్ తో (Olodaterol) కలిపి పీల్పువుగా కూడా టియోట్రోపియమ్ లభ్యము. యుమిక్లిడినియమ్ (Umeclidinium) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము (Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.

కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు (Inhaled corticosteroids.) పుపుస, శ్వాసనాళికలలో తాపమును తగ్గించి ఊపిరికి అడ్డంకిని తగ్గిస్తాయి. వ్యాధి తీవ్రతరము అయినపుడు, వ్యాధి ఉద్రేకించినపుడు వీని ప్రయోజనము కలదు. కాని ఇవి వ్యాధి నిరోధకశక్తిని తగ్గించుట వలన ఊపితిత్తులు సూక్ష్మజీవుల బారికి గుఱి అయే అవకాశములు పెరుగుతాయి. ఈ పీల్పువులను వాడిన పిమ్మట నోటిపూతలు కలుగకుండా ఉండుటకు నోటిని నీళ్ళతో పుక్కిలించాలి. థియాఫిలిన్ ( Theophylline ) :

థియాఫిలిన్ కు (Theophylline) పుపుస, శ్వాసనాళికలను వ్యాకోచింపజేసే గుణము కలదు. వ్యాధి లక్షణములు మిగిలిన మందులతో లొంగని వారికి థియోఫిలిన్ ను నెమ్మదిగా విడుదలయే బిళ్ళల రూపములో వాడవచ్చును. ఆందోళన, వణకు, గుండెదడ, కడుపులో వికారము, వాంతులు,

178 ::