పుట:Hello Doctor Final Book.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాకోచింపజేసే మందులను పీల్పువుల (Inhalers) ద్వారా గాని, తుంపరులుగా శీకర యంత్రములతో (nebulizers) గాని వాడుకోవాలి. బీటా- 2 ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta-2 adrenergic receptor agonists ) :

వ్యాధి ఉద్రేకించినపుడు తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను (Short acting Beta2 adrenergic agonists SABA s) పీల్పువుల (Inhaler) ద్వారా వాడాలి. ఎక్కువ వాడకములో ఉండే ఔషధము ఆల్బుటెరాల్ (Albuterol) పీల్పువు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4 - 6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 2.5 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు తుంపరులుగా వాడవచ్చును. లీవాల్బుటెరాల్ (Levalbuterol) మరో మందు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక శీకర యంత్రము ద్వారా 0.63 - 1.25 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు వాడవచ్చు. ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి. అందు వలన గాలి బాగా ప్రసరిస్తుంది. పిర్ బ్యుటెరాల్ (Pirbuterol) మరో మందు, రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు వాడుకొనవచ్చును.

ఎసిటై ల్ ఖొలీన్ అవరోధకములు (Anticholenergics - Muscarine Antagonists ) :-

ఇప్రట్రోపియమ్ బ్రోమైడును (Ipratropium bromide) పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింప జేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి (Short acting Muscarine Antagonist  SAMAs) కాబట్టి దీనిని

177 ::