పుట:Hello Doctor Final Book.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊపిరితిత్తుల తాపము (Pneumonitis), పుసవేష్టనములో వాయువు (Pneumothorax), హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరు పట్టుట (Pulmonary edema), కర్కటవ్రణములు (Cancers) వంటి ఇతర వ్యాధులను కనుగొనుటకు ఎక్స్ రేలు ఉపయోగపడుతాయి. ఛాతి గణనయంత్ర చిత్రీకరణములు (Cat scans) ఊపిరితిత్తులలో విపరీతముగా ఉబ్బిన భాగము తొలగించే శస్త్రచికిత్సలకు (Lung Volume Reduction Surgery) ముందు, ఊపిరితిత్తుల మార్పు శస్త్రచికిత్సలకు (Lung Transplantation) ముందు, కర్కటవ్రణములను (Cancers) కనుగొనుటకు వాడుతారు. వ్యాధి చికిత్స :-

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధిలో ఊపిరితిత్తులలో కణజాల విధ్వంసము, నష్టము కలుగుట వలన వ్యాధికి ఉపశమనము చేకూర్చుట తప్ప వ్యాధిని సంపూర్ణముగా నయము చేయుట కుదరదు.

పొగత్రాగడము మానివేయుట, హానికర వాయువులు, దుమ్ము, ధూళులకు దూరముగా ఉండుట, ఊపిరితిత్తులను విషజీవాంశముల (viruses), సూక్ష్మజీవుల (bacteria) బారి నుంచి కాపాడుట వలన వ్యాధి పురోగమనమును మందగింప చేయవచ్చును. మధ్య మధ్యలో కలిగే వ్యాధి ఉద్రేకతలను అరికట్టవచ్చును. శ్వాసవ్యాధులు కలవారు ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి ఊపిరితిత్తుల తాపము అరికట్టు టీకాను (Pneumonia vaccine) ప్రతి సంవత్సరము ఫ్లూ రాకుండా ఇన్ఫ్లుయెంజా టీకాను (Influenza vaccine) వేసుకోవాలి. ఔషధములు :శ్వాసనాళికా వ్యాకోచకములు :

ఈ వ్యాధిలో శ్వాసకు అవరోధమును తగ్గించుటకై పుపుస శ్వాస నాళికలలో ఉన్న మృదుకండరముల బిగుతును తగ్గించి ఆ నాళికలను

176 ::