పుట:Hello Doctor Final Book.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

FEV -1. అంచనాలో 50 - 79 % లో ఉంటే తీవ్రము

FEV-1 అంచనాలో 30- 49 % లో ఉంటే తీవ్రతరము

FEV-1 అంచనాలో 30 % కంటె తక్కువయితే తీవ్రతమము అని వ్యాధితీవ్రతను నిర్ణయిస్తారు.

ఊపిరితిత్తులలో కార్బన్ మోనాక్సైడు ప్రసరణ సామర్థ్యత (Diffusing capacity of the Lungs for carbon monoxide DLCO ఈ వ్యాధి ఉన్నవారిలో తగ్గుతుంది. ఈ పరీక్ష రక్తపు ప్రాణవాయువు సంగ్రహణ శక్తిని సూచిస్తుంది.

వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో రక్తములో బైకార్బొనేట్ (bicarbonate) విలువ పెరుగుతుంది. ఊపిరితిత్తులచే తగినంతగా విసర్జింపబడని బొగపు ్గ లుసు వాయువు (carbon dioxide) రక్తములో బైకార్బొనేట్ గా నిలువ అవుతుంది. మూత్రాంగములు (kidneys) యీ బైకార్బొనేట్ ను విసర్జించుటకు కృషి చేసినా ఆ కృషి చాలకపోవచ్చును.

శ్వాస అవరోధ వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో ధమని రక్తవాయువుల (Arterial Blood Gases) పరీక్ష అవసరము. ధమని రక్తములో ప్రాణవాయువు పీడనమును (PaO2), బొగ్గుపులుసువాయువు పీడనము (PaCO2) రక్తపు ph లను కొలిచి శ్వాసవైఫల్యమును (Respiratory failure) పసిగట్టవచ్చును.      ఈ వ్యాధి గల వారిలో ఎఱ్ఱ రక్తకణముల సంఖ్య పెరుగవచ్చును. రక్తములో దీర్ఘకాలము ప్రాణవాయువు ప్రమాణము తగ్గుట వలన శరీరము ఎఱ్ఱకణముల ఉత్పత్తిని పెంచుట దీనికి కారణము.

ఛాతి ఎక్స్ రే చిత్రములలో ఊపిరితిత్తుల ఉబ్బుదలచే ఉదరవితానపు వంకలు తగ్గి సమతలముగా ఉండవచ్చును. ఛాతి ముందు - వెనుకల పరిమాణము పెరుగుతుంది. ఊపిరితిత్తులలో గాలి ఎక్కువగుట వలన పారదర్శకత పెరిగి, రక్కనాళముల గుర్తులు (vascular markings) తగ్గుతాయి. గాలి బుడగలు (bullae) కనిపించవచ్చును.

175 ::