పుట:Hello Doctor Final Book.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

/సంపూర్ణశ్వాస ప్రమాణము FEV1/FVC) నిష్పత్తిని ఉపయోగించి అవరోధక పుపుసవ్యాధులను (Obstructive lung diseases), నిర్బంధ పుపుసవ్యాధులను (Restrictive lung diseases) వేఱుపఱచవచ్చును. అవరోధక పుపుసవ్యాధులు ( Obstructive pulmonary diseases) :-

అవరోధక శ్వాసవ్యాధులు (ఉబ్బస, దీర్ఖకాలిక శ్వాసావరోధము, ఊపిరితిత్తుల ఉబ్బుదల) ఉన్నవారిలో సంపూర్ణశ్వాస ప్రమాణము (FVC) కొంత తగ్గినా, బలనిశ్వాస వాయుపరిమాణము -1 (మొదటి సెకండులో బలముగా వదలగలిగే గాలి పరిమాణము FEV1) విశేషముగా (70 శాతముకంటె తక్కువగా) తగ్గుతుంది. శ్వాసనాళిక వ్యాకోచ చికిత్స అనంతరము (Post bronchodilator treatment) దీర్ఘకాలిక శ్వాసావరోధము గలవారిలో శ్వాస వ్యాపార పరీక్షలు కొద్దిగా మాత్రము మెఱుగవుతాయి. ఉబ్బస వ్యాధిగ్రస్ల థు లో శ్వాసనాళ వ్యాకోచ చికిత్సతో శ్వాస వ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము (FEV-1) విశేషముగా వృద్ధి చెందుతుంది. నిర్బంధ పుపుస వ్యాధులు ( Restrictive lung diseases ) :-

ఊపిరితిత్తులలో తంతీకరణము (Pulmonary Fibrosis), పుపుసవేష్టన వ్యాధులు (Diseases of Pleura) వలన ఉచ్ఛ్వాసమునకు అడ్డంకి కలిగినవారిలో సంపూర్ణ శ్వాసప్రమాణము (FVC), మొదటి సెకండులో నిశ్వాస ప్రమాణము (FEV1) సమాంతరముగా తగ్గుతాయి. ఈ వ్యాధులు లేనివారలలో శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణ పరిమితిలో ఉంటాయి. బలనిశ్వాస వాయు ప్రమాణము-1 (FEV1) వయస్సు, ఎత్తు, బరువు, లింగముల బట్టి ఉండవలసిన విలువను అంచనా వేసి ఆ విలువ కంటె తగ్గుదల బట్టి దీర్ఘకాలిక శ్వాస అవరోధ తీవ్రతను నిర్ణయిస్తారు. వ్యాధి వర్గీకరణము :

FEV -1 అంచనాలో 80 % కంటె ఎక్కువగా ఉంటే మితము

174 ::