పుట:Hello Doctor Final Book.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛాతి ముందు నుంచి వెనుక ప్రమాణము ఎక్కువవుతుంది. ఆయాసము ఉన్నవారిలో ఊపిరికొఱకు కంఠకండరముల వంటి అదనపు కండరములు కూడా శ్రమించుట గమనిస్తాము. వినికిడిగొట్టముతో విన్నపుడు ఛాతిలో ఊపిరిశబ్దములు మందకొడిగా ఉంటాయి. నిశ్వాసశబ్దముల నిడివి పెరుగుతుంది. పిల్లికూతలు (Wheezing) వినిపిస్తాయి. ఛాతిపై వేళ్ళుపెట్టి వానిని రెండవచేతి మధ్యవేలుతో కొడితే ప్రతిధ్వని మోత ఎక్కువగా ( hyper resonance) ఉంటుంది. వ్యాధి నిర్ణయము :

దీర్ఘకాలము పొగ త్రాగినవారిలోను, వృత్తిపరముగా హానికర వాయువులను, దుమ్ములను పీల్చే వారిలోను, గనులలో పనిచేసేవారిలోను దగ్గు, కఫము, ఆయాసము కలుగుతే శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests), ఛాతికి ఎక్స్ - రేలు చేయుట వలన వ్యాధిని నిర్ణయించ వచ్చును. చాలా సంవత్సరాలు పొగ త్రాగినవారిలోను, తాప జనక వాయువులను పీల్చినవారిలోను వ్యాధి లక్షణములు పొడచూపక మునుపే శ్వాస వ్యాపార పరీక్షలు చేసి వ్యాధిని త్వరగా కనిపెట్టుట మంచిది. శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary Function Tests ):

శ్వాస వ్యాపార పరీక్షలు (Pulmonary function tests) శ్వాసకు అవరోధమును కనుగొనుటకు సహాయపడతాయి. శ్వాసమాపకము (Spirometer) అనే పరికరమును శ్వాసవ్యాపార పరీక్షలకై ఉపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము (forced inspiration), తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసములను (forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణ శ్వాస ప్రమాణముగా (Forced Vital Capacity, FVC) పరిగణిస్తారు. బల ఉచ్ఛ్వాసముతో గాలి పీల్చిన పిదప బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము (Forced Expiratory Volume - first second; FEV1),

173 ::