పుట:Hello Doctor Final Book.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాతపు మందిలో దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి జీవితకాలములో పొడచూపుతుంది. వయస్సు పెరిగిన కొలది వ్యాధిలక్షణములు హెచ్చవుతాయి. హానికరమైన యితర గాలులు, గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్ళలో వంటపొయ్యిల నుంచి వచ్చే పొగవలన, బొగ్గుగనులు, బంగారు గనులలో ధూళి, పొగలు, రసాయనములు, హానికర యితర వాయువులు పీల్చుటవలన వాటిలో పనిచేసే కార్మికులకు ఈ వ్యాధి కలుగవచ్చును. పట్టణాలలో వాతావరణ కాలుష్యము ఈ వ్యాధికి దోహదకారి అవుతుంది.

జన్యు పరముగా వచ్చే ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ లోపము (alpha-1 Antitripsin deficiency) వలన దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి పిన్నవయస్సులో రావచ్చును. ఈ వ్యాధి ఉన్నవారిలో ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపము ఉన్నవారు 2 శాతము వఱకు ఉండవచ్చును. ఇతర కుటుంబ సభ్యులకు ఈ వ్యాధి ఉన్నా, 45 సంవత్సరముల వయస్సు లోపల ఈ వ్యాధి కనిపించినా, ఊపిరితిత్తుల క్రింద భాగములలో ఉబ్బుదల ఎక్కువగా ఉన్నా ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ కు తప్పకుండా పరీక్ష చెయ్యాలి. వ్యాధిగతి :

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ఊపిరితిత్తులలో పరంపరలుగా కలిగే తాపము (Inflammation), మాంసకృత్తు విచ్ఛేదనములు (Proteinases) మాంసకృత్తుల అవిచ్ఛేదనముల (Antiproteinases) మధ్య తారతమ్యములు, ఆమ్లజనీకరణము (Oxidation), కణజాలపు సహజమృతుల (Apoptosis) వలన పురోగమిస్తుంది. పుపుసనాళికలు పుపుసగోళములలో తాపము వలన వాపు, అధికముగా శ్లేష్మపు ఉత్పత్తి (mucous production), పుపుసగోళముల విధ్వంసము, తంతీకరణము (fibrosis), సాగుకణజాలపు (elastic tissue) విధ్వంసము జరిగి ఊపిరితిత్తుల ఉబ్బుదల (emphysema) కలుగజేస్తాయి. పుపుస రక్తనాళములపై కూడా ఈ తాప ప్రభావము ఉంటుంది. పై మార్పులు ఊపిరిపైన ఫలితము చూపిస్తాయి. నిశ్వాసము మంద గిస్తుంది. ఊపిరి వదలుట శ్రమతో కూడిన పని అవుతుంది. నిశ్వాస వాయు

171 ::