పుట:Hello Doctor Final Book.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉండు రక్తకేశనాళికల (Capillaries) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది. పుపుసగోళములలోని గాలినుంచి ప్రాణవాయువు కేశనాళికల లోని రక్తమునకు చేరి, కేశనాళికల రక్తములోని బొగ్గుపులుసువాయువు పుపుసగోళముల లోనికి చేరుతుంది. ఊపిరితిత్తులకు రక్తము పుపుసధమని (Pulmonary Artery) ద్వారా చేరి తిరిగి పువుససిరల (Pulmonary veins) ద్వారా హృదయమునకు చేరుకుంటుంది. దీర ్ఘకాలిక శ్వాసావరోధవ్యాధి : ( Chronic Obstructive Pulmonary Disease ) :

ఊపిరితిత్తులలో దీర్ఘకాలము పదేపదే తాపప్రక్రియ (irritation and inflammation) జరుగుటచే కలిగే విధ్వంసము వలన వాయుప్రసరణకు (ముఖ్యముగా నిశ్వాసమునకు) అవరోధము కలిగి దీర్ఘకాలిక శ్వాస అవరోధ వ్యాధి (Chronic Obstructive Pulmonary Disease - COPD) కలుగుతుంది. దీని వలన దగ్గు, కఫము, ఆయాసము కలుగుతాయి.

ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల ఉబ్బుదల (Emphysema), దీర్ఘకాలిక పుపుస, శ్వాసనాళికల తాపము (Chronic Bronchitis), రెండు ప్రక్రియలను గమనిస్తాము. తాపప్రక్రియ వలన పుపుసగోళముల విధ్వంసము, సాగుకణజాలపు విధ్వంసము జరిగి శ్వాసవృక్షపు చివరలో గాలి ఎక్కువై ఉబ్బుదల కనిపిస్తుంది. కఫముతో కూడిన దగ్గు సంవత్సరములో మూడు నెలలు చాలా దినములు, వరుసగా రెండు సంవత్సరాలు ఉంటే దానిని దీర్ఘకాలిక పుపుసనాళికల తాపముగా (Chronic Bronchitis) నిర్ణయించవచ్చును. ఈ వ్యాధి క్రమ క్రమముగా తీవ్రము అవుతుంది. ఊపిరితిత్తులలో పుపుసగోళముల, పుపుసనాళికల, శ్వాసనాళికల విధ్వంసము, నష్టము శాశ్వతము అగుట వలన ఊపిరితిత్తుల వ్యాపారము సామాన్య స్థితికి తిరిగి రాదు. ఉబ్బసకు దీనికి అదే తేడా. వ్యాధికి కారణములు :

పుపుసనాళికలలో పరంపరలుగా తాప ప్రక్రియ జరుగుటకు ప్రధాన కారణము ధూమపానము. ధూమపానము సలిపే వారిలో 20 నుంచి 50

170 ::