పుట:Hello Doctor Final Book.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15. దీర ్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి (Chronic Obstructive Pulmonary Disease) ఇంటికి సెగనుం బెట్టరు

కంటికిఁ బొగబెట్టిరేని కారును జలముల్ పెంటా యూపిరితిత్తులు ? ?

మంటలఁ దెగఁ బాలుసేయ, మానక పొగలన్ ! ! శ్వాసక్రియ :

శరీరకణజాల జీవవ్యాపారములో ప్రాణవాయువు (Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసువాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువుని రక్తమునకు అందించి రక్తము నుంచి బొగ్గుపొలుసువాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయువును రక్త ము నకు చేర్చుటకు, బొగ్గుపులుసువాయువును విసర్జించుటకు ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి ప్రసరణ, ఊపిరితిత్తులకు రక్తప్రసరణ అవసరము. వాతావరణములో ఉన్న గాలి ముక్కు, గొంతుక  స్వరపేటికల ద్వారా శ్వాసనాళమునకు (Trachea) చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా (Bronchi) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయ పడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ద్వితీయ, తృతీయ, అంతిమ పుపుసనాళములుగా (secondary tertiary and terminal bronchi) శాఖలై పిదప శ్వాసనాళికలు (Respiratory bronchioles), పుపుసగోళనాళికలుగా (Alveolar ducts) చీలి చిట్టచివర పుపుసగోళములను (Alveoli) ధరిస్తాయి. ఈ పుపుసగోళములు, వాటి దరిని

169 ::