పుట:Hello Doctor Final Book.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Omalizumab), నెమ్మదిగా విడుదలయే థియాఫిలిన్ మందుబిళ్ళలను కూడా దీర్ఘకాలపు ఉబ్బసను అదుపులో ఉంచుటకు వాడుతారు. నివారణ :

ఉబ్బస ఉన్నవారు  అసహన పదారము ్థ లను (allergens), నివారించుకొనుటకు ప్రయత్నించాలి. ధూమపానము చేయరాదు. వ్యాయామములకు ఆటలకు ముందుగా శ్వాసనాళిక వ్యాకోచములు (Bronchodilators) పీల్చుకొని ఉబ్బసను అరికట్టుకోవాలి. ఉబ్బస పొడచూపినపుడు, ప్రాణవాయువు సంపృక్తత (Oxygen saturation) 92 శాతము కంటె తగ్గుతే ప్రాణవాయువు అందించాలి.

శ్వాసవైఫల్యము (Respiratory failure) కలుగుతే కృత్రిమశ్వాస (Mechanical ventilation) అందించుట అవసరము. ఉబ్బస ఉన్నవారికి నాసికాకుహర వ్యాధులు (Rhinosinusitis, nasal polyps ) ఉంటే వాటిని నివారించాలి.

జఠర అన్ననాళ తిరోగమన (Gastro esophageal reflux disease) వ్యాధి ఉంటే హిష్టమిన్ 2 గ్రాహక అవరోధకములు (H-2 Receptor blockers) గాని, ప్రోటాన్ యంత్రనిరోధములను (Proton pump inhibitors) గాని వాడి జఠరామ్లమును తగ్గించాలి. స్థూలకాయము ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి.

నిద్రావరోధక శ్వాసభంగము (Obstructive sleep apnea) ఉన్నవారికి తగిన చికిత్స అవసరము.

168 ::