పుట:Hello Doctor Final Book.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

methasone), బ్యుడినొసైడ్ (Budenoside), ఫ్లునిసొలైడ్ (Funisolide), ఫ్లుటికసోన్ (Futicasone), మొమెటసోన్ (Mometasone) వంటి కార్టికోస్టీరాయిడ్ ఔషధములు పీల్పువులుగా లభ్యమవుతున్నాయి. ఈ మందులు శ్వాసపథములో తాపమును (Inflammation) తగ్గించుటకు ఉపయోగపడుతాయి. వీటి వాడుకవలన శ్వాసపథములో వాపు తగ్గి వాయుచలనము మెఱుగవుతుంది. తక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము శ్వాసవృక్షమునకే పరిమితమైనా ఎక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము దేహములో పొడచూపవచ్చును. అందువలన ఉబ్బస అదుపులోనికి వచ్చిన పిదప క్రమేణ వాని మోతాదులను తగ్గించే ప్రయత్నము చెయ్యాలి.  నిరంతరపు ఉబ్బసను (Persistent Asthma) అదుపులో ఉంచుటకు కార్టికోస్టీరాయిడ్ పీల్పుసాధనములు చాలా ప్రయోజనకరము. కార్టికోస్టీరాయిడులను పీల్చిన పిదప నోటిని మంచినీళ్ళతో పుక్కిలించు కోవాలి. లేకపోతే నోటిపూత కలిగే అవకాశము ఉన్నది.

దీర్ఘ కా లపు ఉబ్బసను అదుపులో ఉంచుటకు దీర్ఘ కా లిక బీటా ఉత్తేజకములు (Long Acting Beta Agonists LABAs), సాల్మెటరాల్ (Salmeterol) గాని, ఫార్మెటరాల్ (Formeterol) గాని, కార్టీకోస్టీ రాయిడులతో కలిపి పీల్పువులుగా ఉపయోగించవచ్చును. కార్టి కోష్టీ రాయిడులు ( Corticosteroids ):

ఉబ్బస తీవ్రముగా ఉన్నప్పుడు కార్టికోస్ టీ రా యిడులను నోటిద్వారా గాని, సిరలద్వారా గాని వైద్యులు వాడుతారు. ఇతర మందులు :

ఉబ్బస తీవ్రముగా ఉన్నప్పుడు సిరద్వారా మెగ్నీషియమ్ సల్ఫేట్ శ్వాసనాళికలను వ్యాకోచింపజేయుటకు ఉపయోగిస్తారు.

తాపప్రక్రియ తగ్గించే మాంటెలుకాస్ట్ (Montelukast), జఫిర్లుకాస్ట్ (Zafirlukast), స్తంభకణములను (Mast cells) సుస్థిరపఱచు క్రొమొలిన్ సోడియమ్ (Cromolyn sodium), IGE ప్రతిరక్షకము ఒమలిజుమాబ్

167 ::