పుట:Hello Doctor Final Book.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కువగా వాడబడే ఔషధము ఆల్బుటరాల్ పీల్పువు. ఉబ్బస పొడచూపినపుడు దీనిని రెండు నుంచి ఆరు పీల్పులు  ప్రతి ఇరవై నిమిషములు ఉబ్బస తగ్గే వఱకు వాడాలి. లీవాల్బుటెరాలు (Levalbuterol) మరో మందు. దీనిని రెండు నుంచి ఎనిమిది పీల్పులు వఱకు వాడవచ్చు. ఈ మందులను గాలి, లవణజలములతో మిశ్రీకరించి తుంపరులుగా శీకరయంత్రముతో (Nebulizer) కూడా వాడవచ్చును. ఇవి పుపుసనాళికల, శ్వాసనాళికల మృదుకండరాలను సడలించి వాటిని వ్యాకోచింపజేస్తాయి. అందుచే గాలి కదలిక మెఱుగవుతుంది.

ఇదివఱలో బీటా2 - ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు (Beta2 Receptor agonist s) ఎపినెఫ్రిన్, టెర్బుటలిన్ లను చర్మము క్రింద సూదిమందులుగా వాడేవారు. పీల్పువులు, శీకరయంత్రములతో ఔషధములను యివ్వగలిగినప్పుడు అట్టి అవసరము లేదు. గుండెవ్యాధులు ఉన్నవారికి ఆ సూదిమందులు యివ్వకూడదు. ఎసిటై ల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) :

ఇప్రట్రోపియమ్ బ్రోమైడును ( Ipratropium bromide ) పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము (Nebulizer) ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపికాని, లేక ఒంటరిగాను ఊపిరితిత్తులకు అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి (Short acting Muscarine Antagonist SAMA) కాబట్టి దీనిని దినమునకు పలు పర్యాయములు వాడుకోవాలి. యుమిక్లిడినియమ్ (Umeclidinium) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము (Long Acting Muscarine Antagonist LAMA). దీనిని దినమునకు ఒక మోతాదు పీల్పువుగా వాడుకోవాలి. కార్టి కోస్టీరాయిడ్ పీల్పువులు :

ట్రయామ్సినలోన్ (Triamcinolone), బెక్లోమిథసోన్ (Beclo:: 166 ::