పుట:Hello Doctor Final Book.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

bronchodilator treatment) ఉబ్బసవ్యాధిగ్రస్థులలో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది. ఉబ్బస లేనపుడు శ్వాస వ్యాపార పరీక్షలు సాధారణముగా ఉండవచ్చును. గరిష్ఠ ( వాయు ) ప్రవాహమానిక ( Peak flow meter ) :

గరిష్ఠ (వాయు) ప్రవాహ మానికతో (Peak flow meter) సంపూర్ణ దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత సత్వర దీర్ఘనిశ్వాసము చేయించి గరిష్ఠ ప్రవాహము (Peak flow) కొలిచి ఉబ్బసవ్యాధిని నిర్ధారించి, దాని తీవ్రతను అంచనా వేయవచ్చును. ఇవి సులభ పరికరములు, చౌకగా లభిస్తాయి. శ్వాసవ్యాపార పరీక్ష ఫలితములు సామాన్య పరిధులలో ఉంటే మెథాఖొలిన్ యిచ్చి శ్వాసనాళికల స్పందనను శ్వాసవ్యాపార పరీక్షలతో పరిశీలించి ఉబ్బస నిర్ధారణ చేయవచ్చును. ఉబ్బసవ్యాధి ఉన్నవారికి  అసహన పదార్థములకై (Allergens) పరీక్షలు సలుపవచ్చును. చికిత్స :

ఉబ్బస ప్రకోపించినపుడు ఉబ్బస తీవ్రతను గరిష్ఠ ప్రవాహము (peak flow) బట్టి అంచనా కట్టాలి. వ్యాధి ఉపశమన చికిత్సలు తక్షణము మొదలు పెట్టాలి.

వ్యాధి లక్షణములు పొడచూపే తఱచుదనము, తీవ్రతల బట్టి అంతరిత (Intermittent), నిరంతర (Persistent): అల్ప, మధ్యమ, తీవ్ర వ్యాధులుగా పరిగణిస్తారు. శ్వాసనాళికా వ్యాకోచకములు: బీటా-2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta 2 adrenergic agonists ) :

తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను ( Short acting Beta2- adrenergic agonists SABA s) పీల్పువుల (Inhaler) ద్వారా వాడాలి.

165 ::