పుట:Hello Doctor Final Book.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడా ఉబ్బసవ్యాధి ఉద్రేకించుటకు కారణము కాగలవు.

బీటా 2-ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు (Beta 2- adrenergic receptor blockers), ఏస్పిరిన్, స్టీరాయిడులు కాని-తాప హరములు (Non Steroidal Anti Inflammatory Drugs) ఉబ్బసవ్యాధిని ప్రకోపించవచ్చును. వ్యాధి విధానము :

ఉబ్బసవ్యాధి కలిగినవారి శ్వాసపథములో గాలి చలనమునకు అవరోధము కలుగుతుంది. ఈ అవరోధము ముఖ్యముగా నిశ్వాసమునకు ఏర్పడుతుంది. అందువలన ఊపిరితిత్తులు గాలితో ఉబ్బి ఉంటాయి. శ్వాసనాళముల, పుపుసనాళముల, పుపుసనాళికల గోడలలోను, శ్లేష్మపు పొరలలోను (mucosa), ఆమ్లాకర్షణకణములు (Eosinophils - ఇవి శ్వేతకణములలో ఒక రకము), స్తంభకణములు (mast cells), భక్షకకణములు (macrophages), రసికణములు (T- lymphocytes) చేరి తాపము (inflammation) కలుగజేస్తాయి. తాపకణములనుంచి, నాళముల లోపొర నుంచి వెలువడు జీవరసాయనక పదార్థముల వలనను, నాడీ ప్రసారిణుల (Neuro transmitters) ప్రభావము వలనను శ్వాస, పుపుస నాళికలలోఉన్న మృదుకండరములు సంకోచిస్తాయి. అందుచే ఆ నాళికల ప్రమాణములు తగ్గుతాయి. ఈ మృదుకండరముల పరిమాణము కూడా పెరుగుతుంది. శ్వాసనాళికల లోపొర భాగములు తాపము వలన విచ్ఛేదమయి నాళములలో బిరడాలుగా ఏర్పడి గాలి ప్రసరించుటకు అవరోధము కలిగిస్తాయి.

శ్వాసవృక్ష  శ్లేష్మపుపొర క్రింద శ్లేష్మగ్రంథులు సంఖ్యా పరముగాను, పరిమాణములోను వృద్ధి చెంది శ్లేష్మమును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అధిక శ్లేష్మము వాయుచలనమునకు అడ్డు పడుతుంది.

శ్వాసనాళికల తాపప్రక్రియలో భాగముగా కొత్త సూక్ష్మరక్తనాళికలు పుడతాయి. మాన్చు ప్రక్రియలో నాళికలలో లోపొర (అంతస్త్వక్తు) క్రింద తంతుకణములు (fibroblasts) పీచువంటి కొల్లజెన్ (Collagen) తంతువులను

162 ::