పుట:Hello Doctor Final Book.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉబ్బస :

ఉబ్బసవ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధివలన శ్వాసపథములో దీర్ఘకాలిక తాపప్రక్రియ (inflammation) కలిగి మధ్య మధ్యలో వ్యాధి ముమ్మరిస్తుంటుంది. సూక్ష్మాంగజీవులు (bacteria), విషజీవాంశములు (Viruses) ఊపిరితిత్తులపై దాడి జరిపినపుడు, పడని పదార్థములు (allergens), వృత్తులలోను యితరత్రా తాపజనకముల (irritants) బారికి దేహము గుఱి అయినప్పుడు ఊపిరితిత్తుల విపరీత స్పందన వలన ఉబ్బస వ్యాధి లక్షణములు ప్రకోపిస్తాయి.

ఉబ్బస పొడచూపినపుడు పరంపరలుగా దగ్గు, ఆయాసము, ఛాతిబిగువు, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు (wheezings) కలుగుతాయి. వ్యాధి విపరీతమయితే శ్వాసవైఫల్యము కలిగి, తీవ్రత హెచ్చయితే మరణము కూడా సంభవించవచ్చును. వ్యాధి దానంతట అది కాని, చికిత్సతో గాని కొన్ని నిముషముల నుంచి కొన్ని గంటలలో ఉపశమించవచ్చు. ఉబ్బసకు కారణములు :

ఉబ్బసవ్యాధి ప్రంపంచమంతటా ఉన్నా అభివృద్ధి చెందిన దేశాలలో అధికముగా కనిపిస్తుంది. కొన్ని జాతులలో ఉబ్బసవ్యాధి అధికముగా కనిపించినా ఆర్ధిక, సామాజిక, పరిసరముల ప్రభావము దానికి కారణము కావచ్చును. జన్యువులు, క్రోమోజోములు యీ వ్యాధి కలుగుటకు కారణమయినా వాతావరణ, పరిసర ప్రభావములు యీ వ్యాధిపై హెచ్చుగా కలిగి ఉంటాయి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (Respiratory Syncytial Virus RSV), రైనోవైరస్ (Rhinovirus) వంటి విషజీవాంశములు (viruses), పొగాకు పొగ, యితర పొగలు, స్వచ్ఛత కొఱకు వాడే సబ్బులు వంటి రసాయనములు, యితర రసాయనములు, తాపకారులు (Irritants), పుప్పొడి, ధూళిక్రిములు, బొద్దింకల విసర్జ న ములు, పెంపకపు జంతువుల బొచ్చు, సుగంధ పరిమళములు, బూజులు వంటి అసహన పదార్థములు (Allergens), శీతలవాయువులు శ్వాసపథములో తాపము కలుగజేసి వ్యాధి పొడచూపుటకు కారణము అవుతాయి. వ్యాయామము, ఆటలు, మానసిక ఆందోళనలు

161 ::