పుట:Hello Doctor Final Book.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్పత్తి చేయుట వలన తంతీకరణ (fibrosis) జరిగి నాళములు కుచించుకు పోతాయి.

పై కారణములు అన్నిటి వలన శ్వాసవృక్షములో ఊపిరి బంధించ బడుతుంది. రక్తములో ప్రాణవాయువు చేరికకు, బొగ్గుపులుసు వాయువు విసర్జనకు భంగము ఏర్పడుతుంది. ఉబ్బస లక్షణములు :

ఉబ్బస కలిగినప్పుడు పరంపరలుగా దగ్గు, ఆయాసము, ఛాతిలో బిగుతు, శ్రమతో కూడిన నిశ్వాసములు, పిల్లికూతలు (wheezing) కలుగుతాయి. గుండెదడ, అధికస్వేదము కూడా పొడచూపవచ్చును. వ్యాధి తగ్గుతూ అప్పుడప్పుడు ముమ్మరించుట ఉబ్బస లక్షణము. అసహన చర్మతాపము (Atopic Dermatitis), వివిధ పదారము ్థ లకు వికట లక్షణములు కలుగుట, కుటుంబములో ఇతరులకు ఈ వ్యాధి ఉండుట వంటి లక్షణముల వలనను, ప్రత్యక్షముగా వ్యాధిగ్రస్థులను పరీక్షించుట వలనను వైద్యులు రోగనిర్ణయము చేయగలుగుతారు. వైద్యులు వినికిడిగొట్టముతో ఛాతిపై విన్నపుడు నిశ్వాస సమయము హెచ్చుగా ఉండుట గమనిస్తారు. చాల మందిలో నిశ్వాసములో పిల్లికూతలు కూడా వినగలరు. కొందఱిలో పిల్లికూతలు వినిపించక పోవచ్చును. ఆయాసము ఊపిరితిత్తుల తాపము వలన (Pneumonitis), వాయు పుపుసవేష్టనము వలన (Pneumothorax; ఊపిరితిత్తిని ఆవరించు ఉండు పుపుస వేష్టనపు రెండు పొరల మధ్య గాలి చేరుట), ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల వలన, హృదయవైఫల్యము (Congestive heart failure) వంటి గుండెజబ్బుల వలన, పుపుస ధమనిలో రక్తపుగడ్డలు వలన (Pulmonary embolism), రక్తహీనత వలన, అనేక యితర కారణముల వలన కలుగవచ్చును. వ్యాధి నిర్ణయము :

వ్యాధి లక్షణములతో వైద్యులు వ్యాధిని నిర్ణయించగలుగుతారు. వాయు పుపుసవేష్ట న ము (Pneumothorax), హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరుపట్టుట (Congestive heart failure), ఊపిరితిత్తుల

163 ::