పుట:Hello Doctor Final Book.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాగు మేజోళ్ళు (graduated elastic stockings) కాళ్ళపొంగులు తగ్గించుటకు ఉపయోగపడుతాయి. చలనము ( ambulation ) :

నిశ్చలత వలన నిమ్నసిరలలో రక్తపుగడలు ్డ ఏర్పడుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులను నడవమని ప్రోత్సహించాలి. నడవగలిగిన వారు ఎల్లప్పుడు మంచము పట్టుకొని ఉండకూడదు. ప్రాణాపాయ పరిస్థితులలో మందులతో రక్తపుగడల ్డ విచ్ఛేదన జరగనపుడు, కృత్రిమనాళములతో పుపుసధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట (catheter embolectomy), శస్త్రచికిత్సతో పుపుసధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట (surgical embolectomy) వంటి ప్రక్రియలు అనుభవజ్ఞులు చేపట్టవచ్చును. నివారణ :  

నడక, కాలిపిక్కల వ్యాయామము ( calf exercises ), చలనము

(ambulation), నిమ్నసిరలలో రక్తపుగడల ్డ ను నివారించుటకు తోడ్పడుతాయి. శస్త్రచికిత్సల తర్వాత రోగులను త్వరితముగా నడిపించుటకు యత్నించాలి. కాలిపిక్కలపై విరామములతో ఒత్తిడి పెట్టు సాధనములు, కాళ్ళకు వ్యాయామము చేకూర్చు సాధనములు రక్తపుగడ్డలను నివారించుటకు తోడ్పడుతాయి.

కృత్రిమకీళ్ళ శస్త్రచికిత్సల తర్వాత రక్తఘనీభవన అవరోధకములను కొన్నివారములు వాడుతారు. రక్తఘనీభవన అవకాశములు హెచ్చుగా ఉన్నవారిలో కూడా రక్తము గడ్డకట్టుట నివారించు ఔషధములను జాగ్రత్తగా వాడాలి.

158 ::