పుట:Hello Doctor Final Book.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవరోధకములను (anticoagulants) మూడు మాసములు వాడుతారు.

రక్తఘనీభవనము శీఘ్రతరము కావించు వ్యాధులు ఉన్నవారిలో చికిత్స నిరంతరముగా  వాడవలసి ఉంటుంది. చికిత్స వలన రక్తస్రావములు అధికముగా కలుగుతే రక్తఘనీభవన అవరోధకములను (anticoagulants) తాత్కాలికముగా ఆపివేయాలి. అధోబృహత్సిరలో జల్లెడలు ( inferior vena cava filter devices) :

కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడిన వారిలో రక్తస్రావ ఉపద్రవములు (hemorrhage complications) ఉండుట వలన రక్తఘనీభవన అవరోధకములు (anticoagulants) వాడలేనపుడు వారి అధో బృహత్సిరలో (inferior vena cava) జల్లెడ పరికరములు అమర్చి పుపుస ధమనుల లోనికి రక్తపుగడ్డలు చేరకుండా నిరోధిస్తారు. రక ్తపుగడ్డ ల విచ్ఛేదన చికిత్స ( Thrombolytic therapy ) :

పుపుసధమని, దాని శాఖలలో విస్తృతముగా రక్తపుగడ్డలు చేరుకొని (massive pulmonary arterial embolism) రక్తపీడనము పడిపోతే (hypotension) వ్యాధిగ్రస్థులకు అధిక రక్తస్రావ ప్రమాదము లేనప్పుడు సిరద్వారా recombinant tissue plasminogen activator (alteplase) ని ఎక్కించి రక్తపుగడ్డలను విచ్ఛేదించు యత్నము చేస్తారు. హృదయపు కుడిభాగము వైఫల్యము పొందినపుడు, పుపుసధమనిలో రక్తపుగడ్డలను విచ్ఛేదించుటకు rtpa ను (alteplase) వాడవచ్చును. ఇతర చికిత్సలు :

నిమ్నసిరలలో రక్తపుగడ్డల వలన కాళ్ళలో పొంగులు ఉంటే కాళ్ళను ఎత్తుగా ఉంచుతే పొంగు తగ్గే అవకాశము ఉన్నది. [హృదయవైఫల్యము (congestive heart failure) వలన రెండు కాళ్ళు, రెండు పాదములలో పొంగులు ఉన్న రోగులు కాళ్ళను ఎత్తుగా పెట్టుకోకూడదు. అలా చేస్తే కాళ్ళలోను, పాదములలోను చేరిన ద్రవము గుండెకు, ఊపిరితిత్తులకు చేరి ఆయాసము హెచ్చయే అవకాశము ఉంది.]

157 ::