పుట:Hello Doctor Final Book.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తక్కువ అణుభారపు హెపరిన్ తో  (Low Molecular Weight Heparin (LMWH) గాని, ఫాండాపేరినక్స్ తో (fondaparinux) గాని ప్రారంభించి అదేసమయములో విటమిన్ ‘కె‘ అవరోధకము వార్ఫెరిన్ (Warfarin) కూడా మొదలుపెడుతారు.

హెపరిన్ ను సిరద్వారా ఇస్తారు. APTT విలువలు గమనిస్తూ మోతాదును సరిదిద్దుతారు. తక్కువ అణుభారపు హెపరిన్ ను (Low Molecular Weight Heparin)  చర్మము దిగువ సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగవైఫల్యము  (Renal insufficiency) ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి. మూత్రాంగవైఫల్యము తీవ్రముగా ఉంటే LMWH ను వాడకూడదు. Fondaparinux ను కూడా చర్మము క్రింద సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగవైఫల్యము ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి.

హెపరిన్, తక్కువ అణుభారపు హెపరిన్, fondaparinux లను కనీసము 5 దినములు వాడాలి. విటమిన్ కె అవరోధకము వార్ఫరిన్ (నోటి ద్వారా) మొదలు పెట్టి PT / INR రక్తపరీక్షలతో  మోతాదును సరిదిద్దుతు INR విలువ 2 కు వచ్చాక హెపరిన్, LMWH, fondaparinux లను మానివేస్తారు. రక్తఘనీభవన అంశము Xa (10 a) కు అవరోధకములు (Factor X a inhibitors) ఎపిక్సబాన్ (apixaban), రివరోక్సబాన్  (rivaroxaban), ఎండోక్సబాన్ (endoxaban), వార్ఫరిన్ కు (Warfarin) బదులుగా వాడుటకు యిపుడు ప్రాచుర్యములో ఉన్నాయి. మూత్రాంగ వ్యాపారము బాగున్నవారిలో వీటి  మోతాదులను సరిదిద్దవలసిన అవసరము లేదు. PT / INR పరీక్షల అవసరము లేదు. డాబిగాట్రన్ (dabigatran) థ్రాంబిన్ అవరోధకము (Thrombin inhibitor) వార్ఫరిన్ బదులు రక్తము గడ్డకట్టుటను అరికట్టుటకు వాడవచ్చును. రక్తఘనీభవనము కలిగించే యితర వ్యాధులు లేనివారిలో రక్తఘనీభవన

156 ::