పుట:Hello Doctor Final Book.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(CT  Pulmonary Angiogram) విరివిగా వాడుతారు. ఇతర పరీక్షలు :

విద్యుత్ హృల్లేఖములు (electrocardiography), ఛాతి ఎక్స్ రేలు, ధమనీరక్త వాయుపరీక్షలు (arterial blood gas studies), జీవవ్యాపార రక్తపరీక్షలు (metabolic blood tests), రక్తములో ట్రొపోనిన్ (troponin),  శ్రవణాతీత ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు (echocardiography) పరోక్షముగా ఉపయోగపడుతాయి. చికిత్స:

బాహ్యసిరలలో తాపమునకు, రక్తము గడ్డకట్టుటకు రక్తఘనీభవన అవరోధకములను (anticoagulants) వాడరు. నొప్పికి తాప నివారణులను (anti inflammatory agents) వాడవచ్చును. మోకాలిక్రింద జానుసిరకు (popliteal vein) క్రింద ఉన్న నిమ్నసిరలలో రక్తము ఘనీభవనము చెందుతే నొప్పికి ఉపశమన చికిత్స సరిపోతుంది. కాని రక్తఘనీభవనము తొడలో ఊరుసిరకు (femoral vein) వ్యాపిస్తే రక్తఘనీభవన అవరోధకములతో (anticoagulants) చికిత్స అవసరము. రక ్తఘనీభవన అవరోధకములు ( Anticoagulants ) :

నిమ్నసిరలలో రక్తము గడ్డకట్టినా, పుపుసధమని దాని శాఖలలో రక్తపుగడలు ్డ ప్రసరణ అవరోధకములుగా (pulmonary artery embolism) చేరినా, నొప్పి, కాళ్ళపొంగులు, వ్రణములు, పుపుస ధమనిలో ఎక్కువ రక్తపుపోటు (Pulmonary hypertension), ఆకస్మికమరణము వంటి పరిణామములు నివారించుటకు  చికిత్స అవసరము. చికిత్సకు ముందు రోగమును ధ్రువీకరించాలి. చికిత్సకు ముందు, ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము. రక్తకణ గణనములు, జీవవ్యాపార పరీక్షలు (metabolic blood tests), రక్తఘనీభవన పరీక్షలు (ProTime / International Normalised Ratio; PT/ INR), Activated Partial Thromboplastin Time (APTT) అవసరము.

చికిత్సను హెపరిన్ తో (Unfractionated Heparin) గాని,

155 ::