పుట:Hello Doctor Final Book.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిమ్నసిరలలో రక్తపుగడ్డలు నిరూపించబడకపోతే అవసరమని అనిపిస్తే పరీక్షలను కొద్దిదినముల పిదప మరల చేయవచ్చును. సిర చిత్రీకరణములు ( Contrast venography ):

వ్యత్యాస పదార్థములను సిరలలోనికి ఎక్కించి సిరలకు  ఎక్స్- రే లు, గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము (Computerized Axial Tomography), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు (Magnetic Resonance Imaging ) చేయవచ్చును. ఈ పరీక్షలను విరివిగా వాడరు.

పుపుసధమనులలో రక్తపుగడ్డల వంటి ప్రసరణ అవరోధక పదార్థములు (pulmonaryemboli)కనిపెట్టుటకుగణనయంత్ర  పుపుసధమనీ చిత్రీకరణమును (Computerized axial Tomography Pulmonary Angiograms ) విరివిగా వాడుతారు. శ్వాస / ప్రసరణ చిత్రములు ( Ventilation / Perfusion scans ) :

రేడియోధార్మిక పదార్థములను ఊపిరిద్వారాను, సిరలద్వారాను ఇచ్చి ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములను, రక్తము ప్రసరించు భాగములను చిత్రీకరించవచ్చును (Ventilation, Perfusion lung scan; V/Q scan.). పుపుసధమని శాఖలలో ప్రసరణ అవరోధకములు (emboli) ఉన్నపుడు ఊపిరితిత్తులలో ప్రసరణలోపములు (perfusion defects) కనిపిస్తాయి. ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములలో లోపములు (ventilation defects), శ్వాసనాళికలలో అవరోధకములను కాని, ఊపిరితిత్తులలో తాపమును (pneumonia) కాని సూచిస్తాయి. మూత్రాంగవైఫల్యము (renal insufficiency) గలవారిలోను, ఇతర కారణముల వలన ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు వాడలేనప్పుడు రేడియోధార్మిక  శ్వాస / ప్రసరణ (V/Q scans) చిత్రీకరణములు ఉపయోగ పడుతాయి.

పుపుసధమని చిత్రీకరణము (catheter Pulmonary angiogram) ఉపయోగకరమే కాని గణనయంత్ర పుపుస ధమనీ చిత్రీకరణములనే

154 ::